Monday, May 6, 2024

Fake Call Center: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు​.. నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠా అరెస్టు

ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేస్తున్న ఫేక్ కాల్ సెంటర్‌ను ఢిల్లీ పోలీసులు కనిపెట్టారు. అంతర్జాతీయ పర్వతారోహకుడు, ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని జయించిన సూత్రధారితో సహా 10 మంది టెలి మార్కెటర్లను అధికారులు అరెస్టు చేశారు. సూత్రధారి అనిల్ కుమార్ 10 మంది మహిళా టెలిమార్కెటర్లతో 45 రోజులుగా అక్రమ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. “టాటా ఎయిర్ ఇండియా”లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసపూరిత, నిరుద్యోగ యువతకు వాట్సాప్‌లో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లను కూడా పంపినట్టు కనుగొన్నారు.

నిందితులు ఒడిశా, మధ్యప్రదేశ్​, మహారాష్ట్రకు చెందిన వ్యక్తుల డేటాని ‘వర్క్ ఇండియా పోర్టల్’ నుండి సేకరించినట్టు తెలుస్తోంది. తాను 50 మందికి పైగా మోసం చేశానని, రిజిస్ట్రేషన్ ఫీజ, యూనిఫాం చార్జీలు తదితరాల్లో భాగంగా నిరుద్యోగులు, అమాయకుల నుంచి కాల్స్, టెలిఫోన్ ఇంటర్వ్యూలు నిర్వహించి చెల్లింపులు చేసేందుకు మహిళలను నియమించినట్టు నిందితుడు అంగీకరించాడు.

ఇక.. రిజిస్ట్రేషన్ ఫీజ, యూనిఫాం ఖర్చులు తదితరాల కోసం నిందితులు ఒక్కో బాధితుడి నుంచి రూ.1,500 నుంచి రూ.8,000 వరకు వసూలు చేశారు. వారి నుంచి 18 మొబైల్ ఫోన్లు, 1 డాంగిల్, ఫినో పేమెంట్ బ్యాంక్ నుంచి 2 డెబిట్ కార్డులు, ఇతర నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుడు అనిల్ కుమార్ పర్వతారోహకుడిగా ఉంటూనే ట్రావెల్ సెక్టార్‌లో ‘ITS టూర్ & ట్రావెల్స్’ పేరుతో వాహనాలు నడిపేవాడని తెలుస్తోంది. అయితే దాంట్లో వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి అతను కొంతమందిని నియమించుకుని మోసం చేయడం ప్రారంభించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement