Sunday, May 5, 2024

ది బాడీ షాప్‌ ఉత్పత్తుల ధరల తగ్గింపు..

హైదరాబాద్‌ (ప్రభన్యూస్‌) : అసలైన, నైతిక బ్రిటీష్‌ బ్యూటీ బ్రాండ్‌ ది బాడీ షాప్‌ తమ వ్యూహాత్మక మనకు అందుబాటులో ఉండే ప్లాట్‌ఫామ్‌ “ఫాలింగ్‌ ఫర్‌ యు’ ను ప్రకటించింది. ది బాడీ షాప్‌ అత్యధికంగా విక్రయించే ప్రధాన ఉత్పత్తులు భారత్‌లో రూ.595 ఫ్లాట్‌ ధరకు ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా లభ్యమవుతాయి. చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ కేటగిరీల్లో ఈ బ్రాండ్‌ అత్యుత్తమ విక్రయ ఉత్పత్తుల్లో టాప్‌ 12 ఎస్‌కేయూలకు సంబంధించి ఈ వ్యూహాత్మక ధరల తగ్గింపు నిర్ణయాన్ని కరోనా మహమ్మారి అనంతర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సంస్థ తీసుకున్నది. ది బాడీ షాప్‌ ఇండియాకు చెందిన విశాల్‌ చతుర్వేది తమ కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement