Thursday, April 25, 2024

చోడవరం షుగర్‌ సూపర్‌.. ఇక మంచి రంగు.. రవ్వ

చోడవరం (అనకాపల్లి), ప్రభన్యూస్‌: చోడవరం చక్కెర కర్మాగారంలో ఈ ఏడాది మంచి నాణ్యత గల చక్కెర ఉత్పత్తి అవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రంగు.. రవ్వ ఉండడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతున్న పంచదార మెస్‌ల ద్వారా ఎమ్‌, ఎస్‌. ఎస్‌30 రకాలుగా క్వాలిటీలను బట్టి విడదీస్తారు. ఈ ఏడాది గతంలో ఎన్నడూలేని విధంగా సూపర్‌ క్వాలిటీ అయిన ఎం రకం వస్తుండడంతో ఈ చక్కెరకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగి ధర కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

కాగా, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 2 లక్షల 89 వేల టన్నులు చెరుకు క్రషింగ్‌ జరపగా, 2 లక్షల 45 వేల క్వింటాళ్ళ చక్కెర ఉత్పత్తి అయింది. క్రషింగ్‌ సీజన్‌ ముగించే దశకు వచ్చినా మరో 4 రోజులు చక్కెర ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది పంచదార రికవరీతో పాటు క్వాలిటీ కూడా బాగుండడంతో ఫ్యాక్టరీపై కార్మికులకు రైతులకు ఆశలు చిగిరిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement