Sunday, April 28, 2024

ఖర్చులను ఆదా చేసుకునేందుకు నోకియా నిర్ణయం

వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ రంగంలో ఉన్న దిగ్గజ సంస్థ నోకియా సంచలన నిర్ణయం తీసుకుంది. 10,000 మంది సిబ్బందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. నాలుగు ప్రధాన వ్యాపార విభాగాల్లో ఈ కోత ఉంటుందని వెల్లడించింది. అయితే ఏ దేశంలోని ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నదీ అన్న విషయాన్ని మాత్రం తెలియజేయకపోవడం గమనార్హం. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులు చేసేందుకై వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.  లక్ష మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా రెండేళ్లలో ఈ సంఖ్యను 80–85 వేలకు పరిమితం చేయనుంది. తద్వారా 2023 నాటికి రూ.5,200 కోట్లు ఆదా చేయాలని భావిస్తోంది. గత సంవత్సరం CEO గా బాధ్యతలు చేపట్టిన పెక్కా లండ్మార్క్ కీలక మార్పులు చేసి ఇ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది ఈ మార్పులు ప్రక్రియ నోకియా ఫైవ్ జి ఆశయాలను దెబ్బతీసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement