Sunday, May 12, 2024

30 రోజులు ముప్పేట వ్యూహాలు

సాగరయుద్ధం ఖరారైంది. మూడు ప్రధాన పార్టీలు ముందు నుండి సాగర్ ముగ్గులోకి దిగగా, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉపఎన్నిక షెడ్యూల్ ఇపుడు విడుద లైంది. ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఉపఎన్నికకు సంబంధించి తేదీలు ప్రకటించడంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు రణ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 30రోజుల్లో.. ముప్పేట వ్యూహాలు అమలుచేసి గెలుపుముంగిట నిలవాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని ముందే కాంగ్రెస్ అభ్యర్థి
జానారెడ్డి ప్రచారం షురూ చేయగా, బహిరంగసభ నిర్వహించడంతో పాటు మండలాల వారీగా ఇన్ ఛార్జీలను నియమించి గులాబీదళపతి కేసీఆర్ కూడా ఇప్పటికే సై అన్నారు. సిట్టింగ్ స్థానం లో విజయభేరి మోగించేందుకు ముందుగానే బలగాలను మోహరించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి పలు సమావేశాలు నిర్వహించడంతో పాటు అభ్యర్థి పై కూడా కసరత్తు చేశారు. పార్టీ జాతీయ 3 ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా నియోజకవర్గంలో పర్యటించారు.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ శాసనసభకు ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై దృష్టిసారించాయి. తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అధి నాయకత్వం ఇప్పటికే క్షేత్రస్థాయిలో మకాం వేసి పావులుకుదుపుతుండగా గతంలో ఈ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తిరిగి పాగా వేసేందుకు వ్యూహం రచిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికతో పాటు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ
ఎలాగైనా సరే నాగార్జునసాగర్ లో విజయం సాధించాలన్న
పట్టుదలతో ఉంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతరముఖ్య నేతలు ఇప్పటికే ఓ దఫా ఈ నియోజకవర్గంలో పర్యటించి వచ్చారు. తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ఉపఎన్నిక జరుగుతున్న ఈ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. నియోజక వర్గంలో ఎత్తిపోతల పథకాలకు శంకస్థాపన చేయడంతో పాటు హాలియాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ నియోజకవర్గ ప్రచార బాధ్యతలను ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి అప్పగించడంతో ఆయన ఇప్పటికే సుడిగాలి పర్యటన నిర్వహించారు. తెరాస కార్యనిర్వాహకఅధ్యక్షుడు,పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించి ప్రచార ప్రణాళిక, వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.గతఎన్నికలో ఈ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేశామని తిరిగి ఈ ఉపఎన్నికలోనూ ఆ తరహా ఫలితాలు పునరావృతం కావాలని పార్టీ ముఖ్యులకు ఆయన తేల్చిచెప్పారు. నియోజుకవర్గంలోని ఏడు మండలాలకు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలను బాధ్యు లుగా నియమించారు. వారంతా క్షేత్రస్థాయిలో మకాంవేసి పార్టీ శ్రేణులతో మమేకం కావడంతో పాటు ప్రచార సరళిని ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడంతో పాటు తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. గతంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం ఏర్పాటు కాకముందు అనుముల నియోజకవర్గం ఉండేది. ఈ నియోజకవర్గానికి ఆయన దాదాపు ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు.

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అభ్యర్థి ఎంపికపై ఇప్పకే జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో పలు దఫాలు సమాలోచనలు జరిపారన్న ప్రచారం జరుగుతోంది. అభ్యర్థి ఎంపికపై సీఎం కేసీఆర్ బుధ,గురువారాల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఆమోదానికి బుధవారం రాత్రి 7 గంటలకు ప్రగతి భవన్లో మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈబ్సమావేశం అనంతరం నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం ఉదయం శాసనసభలో చర్చ జరగనుంది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఉప ఎన్నికపై మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. రెడ్డి సామాజికవర్గం నుంచా? లేకయాదవసామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని ఈ ఎన్నికల్లో నిలబెట్టే అంశంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement