Friday, May 17, 2024

టాటా స్టీల్‌లో ఏడు కంపెనీల విలీనం


టాటా స్టీల్‌లో ఆరు అనుబంధ కంపెనీలు విలీనం కానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఆమోదించింది. తాయరీలో సహకారాన్ని పెంపొందించడం, గ్రూప్‌ వాటాలను, యాజమాన్యాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ వీలనం చేస్తున్నట్లు టాటా స్టీల్‌ వెల్లడించింది. కంపెనీ ఇంజినీరింగ్‌ సామర్ధ్యాన్ని పెంచేందుకు ఇది తోడ్పడుతుందని తెలిపింది. విలీనం కానున్న కంపెనీల బోర్డులు కూడా దీనికి ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. టాటా స్టీల్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌, టిన్‌ప్లేట్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, టాటా మోటాలిక్స్‌ లిమిటెడ్‌, ది ఇండియన్‌ స్టీల్‌ అండ్‌ వైర్‌ ప్రొడక్స్‌ లిమిటెడ్‌, టాటా స్టీల్‌ మైనింగ్‌ లిమిటెడ్‌, ఎస్‌ అండ్‌ టి మైనింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ టాటా స్టీల్‌లో విలీనం కానున్నాయి.

టాటా స్టీల్‌కు అనుసంధానంగా పని చేస్తున్న టీఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ కూడా విలీనం కానున్న కంపెనీల జాబితాలో ఉంది. ఇందులో టాటా స్టీల్‌కు 34.11 శాతం వాటాలున్నాయి. విలీనం తరువాత కంపెనీ నిర్వాహణ సామర్ధ్యం మెరుగుపడుతుందని టాటా స్టీల్‌ పేర్కొంది. ఒన్‌ టాటా స్టీల్‌ కంపెనీ గా కస్టమర్లకు పరిచయం కానుందని తెలిపింది. ఈ విలనీం భాగస్వాముల సంపదను కూడా పెంచనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement