Wednesday, May 15, 2024

Layoffs | అమెజాన్‌ అలెక్సాలో ఉద్యోగుల తొలగింపు

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ మరోసారి ఉద్యోగులను తొలగించింది. వాయిస్‌ అసిస్టెంట్‌ అలెక్సాలో వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కృత్రిమ మేథపై ఆ సంస్థ ఫోకస్‌ పెట్టినందున ఈ తొలగింపులు చేపట్టినట్లు అమెజాన్‌ తెలిపింది. దీనిపై అలెక్సా, ఫైర్‌ టీవీ విభాగాల వైస్‌ ప్రెసిడెంట్‌ డేనిల్‌ రౌష్‌ ఉద్యోగులకు లేఖ రాశారు. మారుతున్న వ్యాపార ప్రాధాన్యతల్లో భాగంగా మరింత మెరుగ్గా రాణించే ప్రయత్నంలో కొన్నింటిలో మార్పులు చేపడుతున్నామని లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

ఇందులో భాగంగా ఉత్పాదక పెంచడం, ఏఐపై దృష్టి పెట్టడం వంటివి ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే వందలాది మంది ఉద్యోగాలను తీసివేస్తున్నట్లు ఈ లేఖలో ఆయన ఉద్యోగులకు తెలిపారు. ఎంతమందిని తొలగిస్తున్నది మాత్రం వెల్లడించలేదు. అమెజాన్‌ తాజా నిర్ణయంతో అమెరికా, కెనడా, భారత్‌లోని ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుంది. ఏఐ టూల్స్‌పై ఆధారపడటం ఇటీవల కాలంలో పెరిగింది.

ఏఐ ద్వారా తమ ఉత్పాదకత పెంచుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అమెజాన్‌ కూడా కొన్ని నెలలుగా ఏఐని వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగాన ఈ సంవత్సరం ఇప్పటికే అమెజాన్‌ సంస్థ గత ఏడాది చివర్లో, ఈ ఏడాది మొదల్లో 27వేలకు పైగా ఉద్యోగులను తొలగించింది. గేమింగ్‌, మ్యూజిక్‌ విభాగాల్లోనూ ఇటీవల కొంతమందిని తొలగించింది. తాజాగా అలెక్సాలోనూ ఉద్యోగలకు ఇంటికి పంపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement