Sunday, April 28, 2024

2024 మార్చి వరకు ఆర్ధిక మాంద్యం.. అంచనా వేసిన ఎలాన్‌ మస్క్‌

ఆర్ధిక మాంద్యం 2024 మార్చి వరకు కొనసాగే అవకాశం ఉందిన టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అభిప్రాపయడ్డారు. ఇది కేవలం తన అంచనా మాత్రమేనని చెప్పారు. చైనా, ఐరోపాలో ఆర్ధిక మాంద్యం వంటి పరిస్థితుల మూలంగా టెస్లా విద్యుత్‌ వాహనాల అమ్మకాలు తగ్గాయని మస్క్‌ చెప్పారు. దీనిపై ఒక ట్విట్టర్‌ యూజర్‌ అడిగిన ప్రశ్నకు ఎలాన్‌ మస్క్‌ సమాధానం ఇస్తూ ఈ విషయం చెప్పారు. టెస్లా కార్లకు డిమాండ్‌ తగ్గిందన్న మస్క్‌ వ్యాఖ్యలతో కంపెనీ షేరు ధర 6.6 శాతం తగ్గి 207.28 డాలర్లకు పడిపోయింది.

ప్రపంచ ఆర్ధిక పరిస్థితి, ఆర్ధిక మాంద్యంపై ఇటీవల కాలంలో అనేకసార్లు ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జులైలో కంపెనీ వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థూల ఆర్ధిక వ్యవస్థలోని అస్థిరత వల్ల విద్యుత్‌ వాహనాలకు డిమాండ్‌ తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలోనూ ఆయన ఆర్ధిక వ్యవస్థపై తాను చాలా నిరాశతో ఉన్నట్లు తెలిపారు. కంపెనీలు తయారీ కూడా నెమ్మదించిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కంపెనీలో 10 శాతం వరకు ఉద్యోగాల కోత ఉండవచ్చని మస్క్‌ తెలిపారు. ఈ వరస పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు టెస్లా షేరు 9 శాతం వరకు పడిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement