Thursday, May 2, 2024

ఐఫోన్​లో ఈ–సిమ్​ ఈజీగా యాక్టివేట్​ చేసుకోవచ్చు.. ఐఓఎస్​ 16 ద్వారా బిగ్​ అప్​డేట్​

టెక్ దిగ్గజం ఆపిల్​ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2022లో ప్రకటించినట్టు ఐఓఎస్​ 16లో కొత్త కొత్త ఫీచర్స్​ని అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనిలో భాగంగా iOS 16 లో సెకండ్​ సిమ్​ని ఈజీగా యాక్టివేట్​ చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తోంది. సెల్యులార్ సేవను సెటప్ చేసేటప్పుడు బ్లూటూత్ ద్వారా iPhoneల మధ్య eSIMని ట్రాన్స్ ఫ‌ర్ చేయడానికి వీలుండే ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. MacRumors ప్రకారం iOS 16 అప్ డేట్ ఉన్న‌ iPhoneలోని సెట్టింగ్‌ యాప్‌లో “eSIMని సెటప్​పై క్లిక్ చేయండంతో బ్లూటూత్ ద్వారా మరొక iPhone నుండి eSIM క‌నెక్ట్ చేసుకునే చాన్స్​ ఉంది.

అయితే ఈ ఫీచర్ US, UKతో సహా పలు దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. eSIM అనేది డిజిటల్ సిమ్, ఇది ఫిజికల్ నానో-సిమ్ కార్డ్‌ని ఉపయోగించకుండానే క్యారియర్ నుండి సెల్యులార్ ప్లాన్‌ను యాక్టివేట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఐఫోన్ XS నుంచి ఈ తరహా సేవలను ఆపిల్​ సంస్థ అందిస్తోంది. ఐఓఎస్ 16 త్వరలోనే రిలీజ్​ అవుతుందని, ఆ సమయంలో ఈ కొత్త eSIM ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుందని టెక్ దిగ్గజం తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement