Thursday, April 25, 2024

హృతిక్​ మూవీ విక్రమ్​ వేద షూటింగ్​ పూర్తి.. సెప్టెంబర్​లో థియేటర్స్​లోకి

ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటైన విక్రమ్ వేద షూటింగ్ ఈరోజు పూర్తయింది. ప్రధాన నటులు హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ న‌టించిన ఈ యాక్షన్ ఫిల్మ్ విడుదలకు రెడీగా ఉండడంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. రాధికా ఆప్టే నటించిన విక్రమ్ వేదకు పుష్కర్, గాయత్రి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 30, 2022న విడుదల కానుంది.

అనేక అడ్డంకులను ఎదుర్కొన్న తర్వాత యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ వేద షూటింగ్ ఎట్టకేలకు ఇవ్వాల (జూన్ 10న) పూర్తయ్యింది. ఈ మూవీలో సైఫ్అలీఖాన్​, హృతిక్ – విక్రమ్, వేద పాత్రలను పోషించనున్నారు. కాగా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో న‌టించిన హృతిక్ వేద పాత్రలో నటించడం తన‌కు ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించిందన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement