Sunday, May 5, 2024

క్రిప్టో కరెన్సీ పరుగులు, 3నెలల గరిష్టానికి బిట్‌ కాయిన్‌.. అదే బాటలో ఎథేరియం

క్రిప్టో కరెన్సీ దూసుకుపోతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిఎ్టో కరెన్సీ అయిన బిట్‌ కాయిన్‌ 3 నెలల గరిష్టాన్ని తాకింది. 47,500 డాలర్ల మార్క్‌ను సోమవారం దాటేసింది. 48వేల డాలర్లకు చేరువలో ఉంది. రెండో అతిపెద్ద క్రిఎ్టో ఎథేరియం కూడా బిట్‌ కాయిన్‌ బాటలోనే పరుగులు పెడుతున్నది. ఎథేరియం 3,350 డాలర్లను దాటేసింది. మీమ్‌ కాయిన్స్‌ డోజీకాయిన్‌, షిబా ఇనులు 6 శాతానికి పైగా ఎగిశాయి. గత 24 గంటల్లో దాదాపు అన్ని క్రిఎ్టో కరెన్సీలు కూడా 3 శాతం నుంచి 10 శాతం వరకు ఎగిసిపడ్డాయి. కేవలం టెర్రా యూఎస్‌డీ (-0.11 శాతం), వేవ్స్‌ క్రిఎ్టోలు మాత్రమే స్వల్ప నష్టాలు చవిచూశాయి. దాదాపు అన్ని క్రిఎ్టో కరెన్సీలు సోమవారం భారీ లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి.

24 గంటల్లో 3వేల డాలర్లు
బిట్‌ కాయిన్‌ రాత్రి సమయానికి 47,519 డాలర్ల వద్ద ట్రేడ్‌ అయ్యింది. గడిచిన 24 గంటల్లో 44,454.48 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 47,770 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. గడిచిన 24 గంటల్లో సుమారు 3000 డాలర్లకు పైగా బిట్‌ కాయిన్‌ ఎగబాకింది. దీంతో బిట్‌ కాయిన్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 900 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను సోమవారం రాత్రే దాటేసింది. బిట్‌ కాయిన్‌ 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు ఉండగా.. 52 వారాల గరిష్టం 68,990.90 డాలర్లుగా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 3 శాతం వరకు లాభాలను అందించింది. 6.19 శాతం ఎగిసిన బిట్‌ కాయిన్‌ 47,500 డాలర్లు క్రాస్‌ అవ్వగా.. ఎథేరియం 7 శాతం లాభపడి.. 3,369 డాలర్లకు చేరుకుంది. ఎక్స్‌ఆర్‌పీ 6.12 శాతం లాభపడి.. 0.88 డాలర్లకు చేరుకుంది. టెర్రా కరెన్సీ.. 5 శాతం ఎగిసి.. 94.95 డాలర్లకు ఎగబాకింది. సొలానా 10.27 శాతం ఎగబాకి.. 111.24 డాలర్లు, కార్డానో 8.29 శాతం ఎగబాకి 1.22 డాలర్లు చేరుకుంది. అవాలాంచే 9.10 శాతం ఎగబాకి.. 93.33 డాలర్లకు చేరుకోగా.. పోల్కడోట్‌ 9.37 శాతం ఎగబాకి.. 22.98 డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా స్టెల్లర్‌ 6.81 శాతం లాభపడి.. 0.23 డాలర్లకు చేరుకోగా.. డోజీకాయిన్‌ 8.92 శాతం లాభపడి.. 0.15 డాలర్లకు చేరుకుంది. యాక్సీ ఇన్ఫినిటీ 3.64 శాతం ఎగబాకి.. 68.85 డాలర్లకు, చెయిన్‌లింక్‌ 8.46 శాతం లాభపడి.. 17.21 డాలర్లకు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement