Thursday, May 2, 2024

కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ చైర్మన్‌గా వినోద్‌ రాయ్‌.. కాగ్‌లో రాయ్‌ అపార సేవలు

కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ సంస్థ ఎక్స్ఛేంజీలకు సోమవారం కీలక సమాచారం అందజేసింది. మాజీ కంఎ్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వినోద్‌ రాయ్‌ను ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయ సంస్థ కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ చైర్మన్‌గా నియమిస్తున్నట్టు తెలిపింది. కంపెనీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తారని ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. టీఎస్‌ కల్యాణ రామన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గానే కొనసాగుతారని తెలిపింది. అయితే వినోద్‌ రాయ్‌ నియామకాన్ని షేర్‌ హోల్డర్లతో పాటు రెగ్యులేటరీ అథారిటీ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. కాగ్‌ ఆడిటర్‌ జనరల్‌గా పని చేయడంతో పాటు యూనైటెడ్‌ నేషనల్‌ ప్యానెల్‌ ఆఫ్‌ ఆడిటర్స్‌కు, బ్యాంక్‌ బోర్డ్‌ ్స బ్యూరో వంటి కీలక సంస్థలకు కూడా వినోద్‌ రాయ్‌ గతంలో చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక సంస్కరణల్లో వినోద్‌ రాయ్‌ కీలకంగా వ్యవహరించారు. సంస్థలో ఇప్పటికే ఏడుగురు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు ఉండగా.. వినోద్‌ రాయ్‌ 8వ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కానున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా వినోద్‌ రాయ్‌ వివిధ హోదాల్లో పని చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సంస్కరణల కోసంఏర్పాటు చేసిన బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరోకు చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన అందించిన సేవలకు గాను ప్రభుత్వం పద్మభూషణ్‌తోనూ సత్కరించింది.

ఎంతో సంతోషంగా ఉంది: వినోద్‌ రాయ్‌
మార్కెట్‌లో దూకుడుగా వెళ్తున్న కళ్యాణ్‌ జ్యువెలర్స్‌.. తాజాగా వినోద్‌ రాయ్‌ వంటి సమర్థుడికి బోర్డులో చోటు కల్పించడం గమనార్హం. ఈ సందర్భంగా వినోద్‌ రాయ్‌ మాట్లాడుతూ.. కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ చైర్మన్‌గా నియమితులవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పారదర్శకతతో, ఉన్నత విలువలతో వ్యాపారం నిర్వహిస్తున్న కళ్యాణ్‌ జ్యువెలర్స్‌లో భాగస్వామి కావడానికి ఆసక్తిగా ఉన్నట్టు ప్రకటించారు. ఎంతో అనుభవం కలిగిన మాజీ కాగ్‌ సేవలను తాము వినియోగించుకునే అవకాశం దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందని కంపెనీ ఎండీ టీఎస్‌ కల్యాణ రామన్‌ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement