Friday, May 10, 2024

వాణిజ్య గ్యాస్‌ రూ.91.50 తగ్గింపు

వంటగ్యాస్‌ సిలిండర్‌ రేటును చమురు మార్కెటింగ్‌ కంపెనీలు తగ్గించాయి. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.91.50 తగ్గించాయి. కొత్త ధర గురువారం నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్‌ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. తాజా సవరణతో 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1976.07 నుంచి రూ. 1885కు దిగి వచ్చింది. #హదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్‌ ధర రూ. 1798.5కి చేరింది.

అలాగే దేశ రాజధాని ఢిల్లిdలో రూ. 1885కు, ముంబైలో రూ.1844కు లభించనుంది. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధర ఈ ఏడాది మేలో రూ.2,354 వద్ద ఆల్‌ టైం గరిష్ఠ స్థాయికి చేరుకోగా, ప్రస్తుతం వరుసగా ఐదు నెలలో ధర దిగి వచ్చింది. అంతర్జాతీయ క్రూడాయిల్‌ ధరల్లో మార్పుల ఆధారంగా ముడి చమురు ధరలు నిర్ణయం ఉంటుందనేది తెలిసిన సంగతే.

Advertisement

తాజా వార్తలు

Advertisement