Sunday, April 28, 2024

స్పైస్‌జెట్‌కు దెబ్బమీద దెబ్బ..

ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న స్పైస్‌జెట్‌కు మరోషాక్‌ తగిలింది. ఒకవైపు భారీ స్థాయిలో ఈ త్రైమాసికంలో నష్టాలు, మరోవైపు సంస్థ సీఎఫ్‌వో రాజీనామా చేయడంతో గురువారం నాటి మార్కెట్లో స్పైస్‌జెట్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా దాదాపు 15 శాతం కుప్పకూలాయి. ఇది ఇలా ఉండగా గురువారం ఉదయం ఆటోపైలట్‌ స్నాగ్‌ కారణంగా ఢిల్లి నాసిక్‌ స్పైస్‌జెట్‌ విమానాన్ని వెనక్కి మళ్లించిన ఘటన చోటు చేసుకుంది. ఇంధన ధరల భారం, దేశీయ కరెన్సీ రూపాయిక్షీణత, స్పైస్‌జెట్‌ లిమిటెడ్‌ భారీ నష్టాన్ని నమోదు చేసింది.

మరోవైపు సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ సంజీవ్‌ తనేజా రాజీనామా చేసినట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర నష్టం రూ. 789 కోట్లకు పెరిగిందని, ప్రధానంగా అధిక ఇంధన ధరలు, రూపాయి క్షీణత కారణంగా నష్టాలొచ్చాయని బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. మరోవైపు వరుసగా రెండో నెలలో కూడా జీతాలు చెల్లింపు ఆలస్యమైందని ఉద్యోగులు ఆరోపిస్తుండగా, చెల్లింపులు ”గ్రేడెడ్‌ ఫార్మాట్‌”లో జరుగుతున్నాయని స్సైస్‌జెట్‌ వివరణ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement