Saturday, April 27, 2024

ఐఫోన్‌ 4ఎస్‌ఈ పై యాపిల్‌ వెనక్కి

యాపిల్‌ కంపెనీ 4వ జనరేషన్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ తీసుకువచ్చే విషయంలో కంపెనీ తన వ్యూహాన్ని మార్చుకుంది. 2024లో ఈ మోడల్‌ను తీసుకురావాలని యాపిల్‌ భావించింది. తాజాగా ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు కొత్త మోడల్‌కు సంబంధించిన ప్రణాళికలను రద్దు చేసినట్లు సరఫరాదారులకు సమాచారం ఇచ్చింది. ఖరీదైన ఐఫోన్లను సామాన్యులకు దగ్గర చేసేందుకు యాపిల్‌ ఎస్‌ఈ మోడల్‌ ఐఫోన్లను తయారు చేస్తోంది. ఇప్పటికే ఎస్‌ఈ సీరిస్‌లో మూడు జనరేషన్‌ ఫోన్లను యాపిల్‌ విడుదల చేసింది.

యాపిల్‌ ఐఫోన్‌ 4వ జనరేషన్‌ ఫోన్‌లో 5జీని తీసుకురావాని భావించింది. ఇందుకోసం సొంతంగా డెవలప్‌ చేసిన 5జీ చిప్‌ను ఉపయోగించాలని భావించింది. మధ్యస్థాయి నుంచి తక్కువ స్థాయి ఐఫోన్లకు ఆదరణ తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని ప్రముఖ అనలిస్ట్‌ మింగ్‌చికువో అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement