Sunday, May 5, 2024

Airlines: స్పైస్‌ జెట్‌ విమానంలో మళ్లీ సమస్య.. దుబాయి-మదురై విమానంలో సాంకేతిక లోపం

స్పైస్‌ జెట్‌ కు చెందిన దుబాయి- మధురై బోయింగ్‌ బి737 విమానం చక్రాల్లో శబ్దం రావడంతో నిలిపివేశారు. గడిచిన 24 రోజుల్లో ఇలా స్పైస్‌ జెట్‌ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం ఇది 9వ సారని పౌర విమానయాన సంస్థ తెలిపింది. జూన్‌ 19 నుంచి వరసగా ఇలాంటి సంఘటనలు జరగడంతో జులై 6 డిజీసీఏ స్పైస్‌ జెట్‌కు షోకాజ్‌ నోటీ స్‌ జారీ చేసింది. సాంకేతిక సమస్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాజాగా మరో విమానంలోనూ ఇలాంటి సమస్యను ఏర్పడడంతో డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణీకుల భద్రత, మెరుగైన సేవలు అందించడంలో స్పైస్‌ జెట్‌ విఫలమైందని తెలిపింది. సోమవారం నాడు దుబాయి నుంచి మధురై రావాల్సిన స్పైస్‌ జెట్‌ విమాన చక్రాల్లో శబ్దాలు రావడంతో ఇంజనీర్లు పరిశీలించారు.

విమానం టైర్లు సాధారణం కంటే ఎక్కువగా ఒత్తుకుపోయినట్లు గుర్తించారు. దీంతో దుబాయి నుంచి మధురైకి ప్రయాణీకులను తీసుకు వచ్చేందుకు సంస్థ ముంబాయి నుంచి మరో విమానాన్ని పంపించింది. ఈ నెల 11న దుబాయి నుంచి మధురైకి బయలు దేరిన బోయింగ్‌ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించామని, దీంతో మరో విమానాన్ని అక్కడి పంపించామని స్పైస్‌ జెట్‌ సంస్థ ప్రతినిధి తెలిపారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం సాధరణమేనని, వాటిపి ఎప్పటికప్పుడు సరి చేస్తుంటామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement