Friday, April 26, 2024

జ‌న‌వ‌రి నుంచి ఏటీఎం చార్జీల మోత.. ప‌రిమితికి మించి డ్రా చేస్తే అధిక చార్జీలు..

న్యూఢిల్లీ: జనవరి 1నుంచి బ్యాంకింగ్‌ సెక్టార్‌లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏటీఎంల నుంచి పరిమితికి మించి నగదు విత్‌డ్రా చేసేవారి నుంచి బ్యాంకులు అధిక ఛార్జీలు వసూలు చేయనున్నాయి. ఆర్బీఐ మార్గదర్శకాలుకు అనుగుణంగా బ్యాంక్‌లు నగదు లావాదేవీలపై ఛార్జీలను పెంచనున్నాయి. ఉచిత లావాదావేల పరిమితి ముగిసిన అనంతరం వినియోగదార్లు ఎటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసుకుంటే అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు ఛార్జీలను పెంచుతున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ఇప్పటికే ప్రకటించింది.

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పరిమితికి మించిన ఆర్థిక లావాదేవీలపై రూ.21ప్లస్‌ జీఎస్టీ వర్తిస్తుందని, యాక్సిస్‌ బ్యాంక్‌ ఖాతాదారులు తమ బ్యాంక్‌ ఎటీఎంలతోపాటు ఇతర బ్యాంక్‌ ఏటీఎంలను ఉపయోగించుకున్నా ఇది వర్తిస్తుందని తెలిపింది. కాగా పరిమితి మించిన ఏటీఎం లావాదేవీలపై 2022 జనవరి నుంచి ఛార్జీలు పెంచుకోవచ్చని గత జూన్‌లోనే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు అనుమతి మంజూరు చేసింది. బ్యాంక్‌ వినియోగదారులు తమ ఖాతాలో ఉన్న బ్యాంక్‌ ఎటీఎంల్లో నెలకు 5ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. దీంతోపాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మెట్రో కేంద్రాల్లో 3లావాదేవీలు, మేట్రోయేతర కేంద్రాల్లో 5ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement