Wednesday, May 15, 2024

సంక్షోభం దిశగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ..

అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఈ త్రైమాసికంలో 0.9 శాతం తగ్గింది. ఇలా ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు తిరోగమనంలో నమోదు కావడం వరసగా రెండో త్రైమాసికం. గత త్రైమాసికంలో జీడీజీ వృద్ధిరేటు 1.6 శాతం తగ్గింది. ఇలా వరసగా రెండో త్రైమాసికంలోనూ వృద్ధిరేటు తగ్గడం అంటే ఆర్ధిక వ్యవస్థ సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నట్లేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారిగా సామాజిక మాద్యమలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృ సంస్థ మీటా ఆదాయం జూన్‌ త్రైమాసికంలో తగ్గిపోయింది. కంపెనీ చరిత్రలోనే తొలిసారి రెవెన్యూ ఒక శాతం తగ్గి 28.8 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. రానున్న కాలంలో ఆదాయాలు ఇంకా తగ్గుతాయని కంపెనీ అంచనా వేసింది.

మొబైల్‌ చిప్స్‌ సరఫరా దారు క్వాల్కమ్‌ ఆదాయాలు కూడా ఈ త్రైమాసికంలో 5.3 శాతం తగ్గాయి. రెండు దిగ్గజ కంపెనీల ఆదాయం తగ్గడం సంక్షోభానికి సంకేతాలని భావిస్తున్నారు. జీడీపీ వృద్ధిరేటు 0.9 శాతం తగ్గిపోవడంతో దాని ప్రభావం మార్కెట్లపై పడింది. అమెరికా ఆర్ధిక సంక్షోభంలోకి ప్రవేశిస్తోందని మోర్గాన్‌ స్టాన్లీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మైక్‌ లొవేంగ్రేట్‌ స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement