Monday, April 29, 2024

ఎయిర్‌టెల్‌ లాంగ్ వాలిడిటీ ప్లాన్‌.. డేటా, కాలింగ్‌, ఓ‌టీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా

స్మార్ట్‌ఫోన్‌లు వాడేవారి సంఖ్య పెర‌గ‌డం.. డేటా వినియోగం పెర‌గ‌డంతో ఆయా నెట్‌వ‌ర్క్‌లు వాలిడిటీతో పాటు డేటాపై కూడా ప‌లు ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మ‌ధ్య ఓటీటీలు అందుబాటులోకి రావ‌డంతో వాటి స‌బ్‌స్ట్రిప్ష‌న్ అందించి యూజ‌ర్స్‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. కొన్ని ప్లాన్‌ల‌ను రీచార్జి చేసిన తర్వాత OTT సబ్‌స్క్రిప్షన్ కూడా ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టిస్తున్నాయి. అయితే ఈ మ‌ధ్య ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్ కొత్త ఎత్తుగ‌డ‌తో ముందుకొచ్చింది. జియో నెట్‌వ‌ర్క్‌ని దెబ్బ‌తీయాల‌నే ప్లాన్‌తోపాటు, ఎక్కువ మొత్తంలో యూజర్స్‌ని ఆక‌ట్టుకునేలా త‌న ప్లాన్‌ల‌ను చేంజ్ చేసింది. అవేంటో చ‌దివి తెలుసుకుందాం..

ఎయిర్‌టెల్ టెలికాం యూజ‌ర్ అయితే.. ఈ ప్లాన్‌ రిచార్జ్ చేసుకోవ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండే అవ‌కాశం ఉంది..

ఎయిర్‌టెల్ 666 ప్లాన్ :
Airtel ఈ ప్లాన్ వాలిడిటీ మొత్తం 84 రోజులు. ఇందులో ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు డెయిలీ డేటా ఇంటర్నెట్ కోసం 1.5GB అందిస్తున్నారు. ఈ ప్లాన్‌లో రోజుకు 100 SMSలు కూడా ల‌భించ‌నున్నాయి. ఈ ప్లాన్‌ని రీచార్జ్ చేసిన తర్వాత 30 రోజుల పాటు Amazon Prime వీడియో ఉచిత ట్రయల్‌ను పొందొచ్చు. అంతేకాకుండా వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కాకుండా ఈ ప్లాన్‌లో ఎన్నో ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఎయిర్‌టెల్ 839 ప్లాన్
Airtel ఈ ప్లాన్‌లో ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు ఇంటర్నెట్ వినియోగం కోసం 2GB డెయిలీ డేటా అందిస్తోంది. ఈ ప్లాన్ మొత్తం వాలిడిటీ 84 రోజులు. అంతేకాకుండా ప్లాన్‌లో రోజూ 100 SMSలు కూడా ల‌భిస్తాయి. ఈ ప్లాన్‌ని రీఛార్జ్ చేసిన తర్వాత Disney Plus Hotstar మొబైల్‌కి 3 నెలల సబ్‌స్క్రిప్షన్ పొంద‌వ‌చ్చు. ఇంకా Amazon Prime 1 నెల ఉచిత ట్రయల్‌ని కూడా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement