Sunday, May 5, 2024

నత్తనడకన గోదాముల నిర్మాణం.. అన్నదాతల ఆశలు తీరేది ఎన్నడు

కర్నూలు ప్రతినిధి, (ప్రభన్యూస్‌) : అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా పంట ఉత్పత్తులను ఆరపెట్టుకునేందుకు.. నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు విక్రయించుకునేందుకు వెసలు బాటు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కర్నూల్‌ జిల్లాకు 236 మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు మంజూరు చేసింది. నాబార్డ్‌ నిధులతో ఈ గోదాములు నిర్మించాలని డిసెంబర్లో పనులు ప్రారంభించారు. 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదామును రూ.40 లక్షలతో, 1000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదామును రూ.75 లక్షల తో నిర్మించనున్నారు.. హైదరాబాద్‌కు చెందిన కంపెనీలు ఉమ్మడి జిల్లాలో గోదాముల నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్నారు. కర్నూలు జిల్లాకు ఒకరు, నంద్యాల జిల్లాకు ఒకరు చొప్పున పనులు దక్కించుకున్నారు. ఒక్కొ గోదాములకు ఒకరు చొప్పున కాక రూ.40 కోట్ల పనులను ఒకరు చొప్పున టెండర్లు ఖరారు చేస్తున్నారు. 2022 జనవరి నుంచి గుత్తేదారులు టెండర్లు దక్కించుకోగా ఈ పనులు తొమ్మిది నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది.. నిర్మాణ ధరలు. పెరగడంతో గుత్తేదారులు ముందుకు వెళ్లడం లేదు.. పర్యవేక్షించాల్సిన అధికారులు..
నిద్ర మత్తులో ఉండడంతో.. గోదాముల నిర్మాణం పనులు నత్తనడకన జరుగుతున్నాయి.

కర్నూలు జిల్లాకు 95 గోదాముల నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 35 పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లాకు సంబంధించి 141 గోదాముల నిర్మాణానికి కేవలం 75. గోదాముల పనులు ప్రారంభమయ్యాయి. ఈ గోదాముల నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిన.. అధికార యంత్రాంగం కేవలం కార్యాలయాలకి పరిమితం కావడంతో.. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది.. ప్రధానంగా 8 నియోజకవర్గాలకు ఓకే గుత్తేదారు డు పనులు దక్కించుకోవడంతో.. నిర్మాణ పనులు. నత్తనడకన జరుగుతున్నాయి. కొన్ని చోట్ల. భూ సమస్య ఉన్నా.. వాటి వివరాలు నివేదించడం. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంబంధిత అధికార యంత్రాంగం. కాలక్షేపం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement