Monday, April 29, 2024

72 శాతం 2000 నోట్ల మార్పిడి

రిజర్వ్‌ బ్యాంక్‌ 2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న తరువాత ఇప్పటి వరకు 72 శాతం నోట్లు బ్యాంక్‌ల్లో డిపాజిట్లు చేడయం కాని, కౌంటర్‌లో మార్చుకోవడం జరిగింది. మే 19న ఆర్బీఐ ఈ నోట్లను మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 2వేల నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్‌ 30 వరకు గడువు విచ్చింది. ఈ నిర్ణయం తీసుకునే సమయానికి చలామణిలో 3.62 లక్షల కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు ఉన్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇప్పటికు వివిధ బ్యాంక్‌ల్లో పెద్ద ఎత్తున 2000 రూపాయల నోట్ల డిపాజిట్లు జరిగినట్లు బ్యాంకింగ్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు బ్యాంక్‌ కౌంటర్లలోనూ ఒకే సారి 20వేల వరకు మార్చుకునే అవకాశం ఉంది. ఆర్బీఐ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు 72 శాతం నోట్లు మార్పిడి జరిగినట్లు బ్యాంకింగ్‌ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement