Sunday, April 28, 2024

ఎల్‌ఐసి షేర్ల పతనంతో 18 బిలియన్‌ డాలర్ల నష్టం

ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ( ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఆఫర్‌ తరువాత వరసగా షేర్ల విలువ పతనం అవుతూ వస్తోంది. ఆఫర్‌ ధరతో పోల్చితే ఎల్‌ఐసీ షేర్ల ధరలు 30 శాతానికి పైగా పతనమయ్యాయి. దీని వల్ల 18 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.
స్టాక్‌ మార్కెట్లో శుక్రవారం నాడు ఎల్‌ఐసీ షేరు ధర 661.70 రూపాయాలుగా ట్రేడయ్యింది. షేర్‌ జారీ ధర 949 రూపాయలతో పోల్చితే ఇది 30 శాతానికి పైగా తగ్గిపోయింది. ఫలితంగా 18 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ తగ్గిపోయింది. ఈ సంవత్సరం మే 17న స్టాక్‌ మార్కెట్లో ప్రవేశించే సమయానికి దేశంలో విలువతో ఈ షేర్లు మూడో స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం షేర్ల మార్కెట్‌లో లిష్ట్‌ అయిన తరువాత అత్యంత ఎక్కువ నష్టాలు తెచ్చిన షేర్లుగా మిగిలిపోయాయి.

యాంకర్‌ ఇన్వెస్టర్లు 30 రోజుల వరకు షేర్లను అమ్మడానికి, కొనడానికి వీలు లేదు. ఇది ముగియక ముందే ఎల్‌ఐసీ షేర్ల ధరలు వరసగా పతనం అయ్యాయి. ఎల్‌ఐసీ షేర్ల పతనంపై పరిశీలన చేస్తున్నామని, ఇన్వెస్టర్ల నష్టపోకుండా, షేర్ల ధరలు పెరిగేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎల్‌ఐసీ ప్రకటించింది. షేర్ల పతనం తాత్కలికమని , ఎల్‌ఐసీ ప్రాధమిక బలాన్ని మార్కెట్‌లో ఇన్వెస్టర్లు త్వరలోనే గుర్తిస్తారని, తప్పకుండా షేర్ల ధరలు పెరుగుతాయని ఎల్‌ఐసీ విశ్వాసంగా ఉంది. శుక్రవారం నాడు స్టాక్‌ మార్కెట్లు ముగిసే సమయానికి ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ 4.2 లక్షల కోట్లుగా ఉంది. వాస్తవ విలువతో పోల్చితే 1.8 లక్షల కోట్లు నష్టపోయింది. 949 షేర్ల ధరలతో పోల్చితే ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ 6 లక్షల కోట్లుగా లెక్కించారు. స్టాక్‌ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు జరుపుతుండటంతో ఎల్‌ఐసీ షేర్ల ధరలపై ప్రభావం పడుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement