Monday, April 29, 2024

Breaking: హైదరాబాద్​లో మోస్తరు వర్షం.. జూబీలీహిల్స్​లో చినుకులతో మొదలై..

హైదరాబాద్​లో ఇవ్వాల (ఆదివారం) రాత్రి 9 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్​లో చిటపట చినుకులతో మొదలైన వాన కాస్త మోస్తరు జల్లుగా మారింది. దీంతో అప్పటిదాకా ఈజీగా మూవ్​ అవుతున్న వేహికల్స్​ అన్నీ ఒకేసారి ఆగిపోయాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. చినుకుల నుంచి తడవకుండా చాలామంది మెట్రో పిల్లర్ల దగ్గర ఆగిపోయారు.

ఇక.. నైరుతి ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో ఈ నెల 30 దాకా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్​ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, పెద్దపల్లి, వరంగల్‌, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, దక్షిణ ఒడిశా మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి, ఇంటీరియర్‌ ఒడిశా నుంచి దక్షిణ ఒడిశా వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణలో రాగల 48 గంటల దాకా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement