Wednesday, May 8, 2024

Yuva galam – మాది హ్యూమనిజం…మీది ఫ్యాక్షనిజం! – నారా లోకేష్

తాడేపల్లి,ఆగస్టు17(ప్రభ న్యూస్) మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం
పాదయాత్ర 187వ రోజు దిగ్విజయంగా కొనసాగింది. నారా లోకేష్ పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. నారా లోకేష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ యువ గళం పాదయాత్రలో ముందుకు సాగారు.ప్రకాష్ నగర్ వద్ద దళితలు కలిసి దళితులపై జరుగుతున్న అన్యాయాలపై లోకేష్ కి వినతిపత్రం సమర్పించారు .నులకపేటలోత్రాగునీరు డ్రైనేజీ రోడ్లు కరెంటు మౌలిక సదుపాయాల కోసం వినతిపత్రం సమర్పించారు.6 వార్డ్ ప్రజలు నారా లోకేష్ ను కలిసి. వినతి పత్రం సమర్పించారు.


తాడేపల్లి పట్టణంలో 60ఏళ్లుగా రైల్వే, కొండ పోరంబోకు స్థలాల్లో నివాసం ఉంటున్నాని మా ప్రాంతంలో అధికంగా ఉన్న వడ్డెర, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు భూములు లేవని తెలిపారు.ఈ సందర్బంగా నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ అండ్ కోకు అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని అన్నారు. కృష్ణానదిలో ఇసుక పరిసర గ్రామాల ప్రజలకు అందుబాటులో లేకుండా పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ వేలకోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. పేదవాడి సెంటుపట్టాల పేరుతో రూ.7వేల కోట్లు దోచుకున్న వైసిపి నేతలు, ఇచ్చిన పట్టాలను కూడా వాస్తవ లబ్ధిదారులకు కాకుండా తమ పార్టీవారికి ఇచ్చుకున్నారని మేం అధికారంలోకి వచ్చాక దీర్ఘకాలంగా పేదల అనుభవంలో ఉన్న భూములను గుర్తించి, రెగ్యులర్ చేస్తామని ఇల్లు లేని ప్రతిపేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తామని మెరుగైన ఇసుక పాలసీని తెచ్చి సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తెస్తామని అన్నారు.

పేదోళ్ల ఆకలి తీర్చే అన్నాక్యాంటీన్ల రద్దుతో సైకో ముఖ్యమంత్రి అభాగ్యుల నోటికాడ కూడులాగేస్తే, సొంత నిధులతో మేం అన్నార్తుల ఆకలి తీరుస్తున్నామని . మంగళగిరి నియోజకవర్గం నులకపేటలో నేను ఏర్పాటుచేసిన అన్యాక్యాంటీన్. పేదలు కడుపునిండా పట్టెడన్నం తింటే ఓర్చుకోలేని జగన్… వేదికలపై మాత్రం నేను పేదవాడి పక్షమంటాడు. జగన్ రెడ్డి సిద్ధాంతం పచ్చినెత్తురు తాగే ఫ్యాక్షనిజమైతే… మాది సకలజనులు సుభిక్షింగా ఉండాలనే హ్యుమనిజం అని అన్నారు.నులకపేటలో జగన్ ఏర్పాటుచేసిన ఫిష్ ఆంధ్ర దుకాణం. నేతిబీరలో నెయ్యి లేనట్లే…ఫిష్ ఆంధ్రలో కూడా చేపలు మాత్రం కనపడవని. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలివ్వడం చేతగాని జగన్… చదువుకున్న యువకులతో చేపలు, మాంసం దుకాణాలు పెట్టించాడని చంద్రబాబు పాలనలో కియా, టిసిఎల్, ఫ్యాక్స్ కాన్, సెల్ కాన్ లాంటి సంస్థలను రప్పించి లక్షలాదిమందికి ఉద్యోగాలిస్తే…
సైకో పాలనలో ఉన్న పరిశ్రమలను తరిమేసి యువత భవితను చీకటిమయం చేశాడని విధ్వంసకుడి అరాచకానికి, విజనరీ లీడర్ కు ఉన్న తేడా గమనించారా?! అని ప్రశ్నించారు.

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నక్క ఆనంద్ బాబు,యరపతినేని శ్రీనివాసరావు,జీవి ఆంజనేయులు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మంగళగిరి నియోజకవర్గ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, తమ్మిశెట్టి జానకి దేవి, ఆకుల జయ సత్య, టిడిపి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు, మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు, తాడేపల్లి పట్టణ రూరల్ కార్యదర్శి దారా దాసు, కొల్లి శేషు,దానబోయిన సుందర్రావు యాదవ్,జంగాల సాంబశివరావు,కొమ్మా రెడ్డి కిరణ్,జంగాల వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement