Wednesday, May 8, 2024

YSRCP – బుట్టా కే ఎమ్మిగనూరు … నియోజకవర్గ పగ్గాలు రేణుక‌కు అప్పగింత…

కర్నూల్ బ్యూరో – సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ, ఎంపీ స్థానాల టికెట్ల కోసం రాజకీయ పార్టీలలో పోటీ మొదలైంది. ముఖ్యంగా అధికార పార్టీలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ పార్టీ వర్గాలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అంతు పట్టడం లేదు. ఎప్పుడు ఎవరికి ఏ పదవి వరిస్తుందో.. ఎవరు మాయమ వుతారో తెలియని పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జిగా మాచాని వెంకటేష్ నియమించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఉన్నపలంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం కు మాజీ ఎంపీ బుట్టా రేణుకను పార్టీ సమన్వయకర్తగా ఖరారు చేయడం పార్టీ వర్గాల్లో చర్చ నియంశంగా మారింది.

దశాబ్దం క్రితం రాజకీయ అనుభవం లేని కుటుంబం నుంచి వచ్చిన బుట్ట రేణుకా అధికార పార్టీ వైసీపీలో కీలక పదవుల్లో పనిచేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ బుట్టరేణుకాకు కర్నూలు ఎంపీ సీటు కేటాయించగా, దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో ఆమె విజయం సాధించారు. కాని.. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో.. బుట్టరేణుకా ఆ పార్టీలో చేరారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో ఇమడలేక 2019 సాధారణ ఎన్నికల ముందు సొంతగూటికి తిరిగి వైసీపీలో చేరారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేని తనకు జిల్లాలో హేమహేమీ నాయకులు ఉన్నప్పటికీ.. ఎంపీ సీటు కేటాయించి భారీ మెజారిటీతో గెలిపించుకున్న జగన్ ని కాదని.. వైసీపీ పార్టీని విడిచి తప్పు చేశానని ఆమె అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారట. 2019 సాధారణ ఎన్నికల ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరినా.. బుట్టరేణుకకు అప్పుడు రాజకీయంగా ఎటువంటి హామీ ఇవ్వలేదని సమాచారం. సాధారణ కార్యకర్తగా ఉండి ఎన్నికల్లో ప్రచారం చేసి జిల్లాలో వైసీపీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తానని అప్పుడు జగన్ సమక్షంలో ప్రకటించారు. అప్పటినుంచి వైసీపీలో సామాన్య కార్యకర్తగానే కొనసాగుతూ వచ్చారు.. మళ్ళీ 2024 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమె కర్నూలు ఎమ్మిగనూరు నియోజకవర్గం తో పాటు ఎంపి స్థానంను ఆశిస్తూ వచ్చారు.

అయితే మొదట్లో అధిష్టానం నుంచి ఆమెకు ఎలాంటి హామీ రా లేదని తర్జనభర్జన పడుతూ వచ్చారు. వాస్తవంగా బుట్టా రేణుక పుట్టినిల్లు పత్తికొండ నుంచి పోటీ చేయాలని ఆలోచించారు. అది కుదరకపోతే తన సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉన్న ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పోటీకి దిగాలని ఆలోచనతో ప్రయత్నం చేస్తూ వచ్చారు .అన్ని కలిసి వచ్చి కర్నూలు ఎంపీ సీటు ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని… తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా సిద్ధంగా ఉండాలని తన అనుచరులకు కూడా ఆమె పిలుపునిచ్చారట. అయితే… బుట్టరేణుకాకు పత్తికొండ సీటు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో, ఎమ్మిగనూరు టికెట్ కోసం పార్టీలో తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తూ వచ్చాయి. అయితే ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఈసారి ఎన్నికల్లో తన వారసుడు… ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిచ్చేందుకు ముఖ్యమంత్రి దగ్గర లాబీయింగ్ చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి తన కుమారుడికి సీటు ఇవ్వకుంటే.. తానే ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేయాలనే ఆలోచన కూడా ముందు ఉంచారు. ఇదే సమయంలో చెన్నకేశవరెడ్డినీ కాదని బుట్టరేణుకాకు ఎమ్మిగనూరు సీటు రాదని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తూ వచ్చారు. అదే నిజమైతే బుట్టరేణుకా అసలు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా.. అధిష్టానం ఆమెకు ఈసారైనా సీటు ఇస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఓ దశలో బుట్టరేణుకాకు వైసీపీ సీటు ఇవ్వకుంటే.. ఆమె ప్రయాణం ఎటువైపు అన్న ప్రశ్న నియోజకవర్గంలో చక్కర్లు కొట్టింది. ఇదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తో మంతనాలు నిర్వహించిన వైసీపీ అధిష్టానం ఎమ్మిగనూరు వైసీపీ సమన్వయకర్తగా మాచని వెంకటేష్ ను నియమించింది.

దీంతో వైసీపీ అధిష్టానం పై బుట్టరేణుకా అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జోరు అందుకుంది. జిల్లాలో వైసీపీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొన లేదు. ముఖ్యంగా సీఎం జగన్ పత్తికొండలో రైతు భరోసా కార్యక్రమంలో కూడా… పాల్గొనకపోవడంతో కార్యకర్తలు సందిగ్ధంలో పడ్డారు.తమ నేత పార్టీలో ఉన్నారా లేదా, ఉంటే ఎందుకు వైసీపీ కార్యక్రమంలో పాల్గొనడం లేదు అంటూ చర్చ కూడా కొనసాగింది. మొత్తానికి తమ నేత ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఏ పార్టీలో కొనసాగుతారో అన్నా అయోమయ పరిస్థితి నెలకొంది. వైసీపీ పార్టీ ఒకవేళ బుట్టరేణుకాకు ఎంపీ, ఎమ్మెల్యే సిటు ఇవ్వకపోతే… బుట్టరేణుకా ఎటువైపు మొగ్గు చూపుతోంది అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇలాంటి చిలువలు, పలువలకు ఆమె దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అందుకు కట్టుబడి ఉంటానఅంటూ ప్రకటిస్తూ వచ్చారు. ఇదే సమయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జిగా వెంకటేష్ నియామకంపై ఆ పార్టీలో అసంతృప్తి చెలరేగింది. పార్టీ వర్గాలు కూడా ఆయనను మార్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విన్నవిస్తూ వచ్చారు.

దీంతో పునరాలోచనాల పడ్డ వైసిపి.. మాచాని వెంకటేష్ గెలుపోటములపై పార్టీ వర్గాలతో సమీక్ష నిర్వహించింది. ఆ సమీక్షలో ఆయనకు వ్యతిరేకంగా రావడంతో.. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జినీ మార్పు చేయాలని ఆలోచనకు వచ్చింది. ఈ క్రమంలో బుట్టా రేణుక పేరు తిరిగి తెర పైకి వచ్చింది. అయితే ఆమెకు టికెట్ కేటాయించే క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తో మంతనాలు నిర్వహించారు. వారి మధ్య సయోధ్య కుదిరిచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జిగా బుట్టా రేణుక నియమిస్తే.. ఆమెకు సపోర్ట్ చేయాలని ముఖ్యమంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి సూచించినట్లు సమాచారం. అంతేకాదు పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే తనయుడు జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ, మాచాని వెంకటేష్ కు నామినేటెడ్ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇటు బుట్ట, అటు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మధ్య సయోధ్య కుదరడంతో ఎట్టకేలకు ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా బుట్టా రేణుక పేరును ఖరారు చేస్తూ వైసిపి అధిష్టానం నిర్ణయం తీసుకోవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement