Thursday, May 16, 2024

అత్యాచారాలను అడ్డుకోగలగడమే నిజమైన రక్షాబంధన్: పవన్ కళ్యాణ్

ఆడపిల్లలపై జరుగుతున్న దురాగతాలు బాధను కలిగిస్తున్నాయన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్… ఇటీవల జరిగిన సంఘటనలు మనసును కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలంతా మన అక్కాచెల్లెల్లే అనే భావన అందరిలో రావాలని చెప్పారు. మహిళలు, అమ్మాయిలు నిర్భయంగా తిరిగేలా వారికి భరోసా ఇవ్వాలని అన్నారు. అత్యాచారాలను అడ్డుకోగలగడమే నిజమైన రక్షాబంధన్ అని చెప్పారు. భారతీయుల బాంధవ్యాలను తెలిపే వేడుకే రక్షా బంధన్ అని పవన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని విషయాల్లో సగభాగమైన మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగుతుండటం బాధను కలిగిస్తోందని అన్నారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. ఆడవారు అబలలు కాదు సబలలు అని నిరూపించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

వైఎస్ఆర్ టీపీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా రాక్షబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. తన తోడబుట్టిన జగనన్నకు, తాను నమ్మిన సిద్ధాంతం కోసం తనకు అండగా నిలిచిన, తాను ఎంచుకున్న మార్గంలో తనతో కలిసి నడుస్తున్న, తన ఆశయ సాధనలో తనను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖసంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని షర్మిల చెప్పారు.

ఇది కూడా చదవండి: కొంప ముంచిన బుల్లెట్ సాంగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement