Friday, April 26, 2024

కొంప ముంచిన బుల్లెట్ సాంగ్

‘’బుల్లెట్ బండెక్కి వచ్చేస్తావా’’ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పాటపై పెళ్లి బారాత్ లో వధువు తన భర్త ముందు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్‌లోనూ ఈ పాట హల్ చల్ చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళ పల్లి పిహెచ్ సీలో బుల్లెట్ బండి పాటపై ఆస్పత్రి సిబ్బంది నృత్యం చేస్తున్న వీడియో బయటకి వచ్చింది. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్పత్రి సిబ్బంది డ్యాన్స్ చేస్తున్న వీడియోపై జిల్లా కలెక్టర్ సిరియస్ అయ్యారు. దీనిపై విచారణకు ఆదేశించారు. అంతేకాదు విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు జిల్లా వైద్యాధికారి సుమన్ రావు మెమో జారీ చేశారు. విచారణ అనంతరం చర్యలు తీసుకోనున్నారు.

ఇది ఇలా ఉండగా.. నర్సు డాన్స్ కు నెటిజన్లు ప్రశంసలు ఇవ్వగా.. మరికొందరు ఆస్పత్రిలో ఈ డాన్సులు ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement