Friday, December 6, 2024

Wonder Kid – ఏడాది వ‌య‌సులోనే నోబెల్ రికార్డ్ సాధించిన బాలుడు ..

కశింకోట, అక్టోబర్11(ప్రభ న్యూస్):ఓ ఏడాది బాబు ఇంట్లో ఉంటే బుడిబుడి అడుగులు వేసుకుంటూ సందడి చేస్తూవుంటాడు. పాల బుగ్గల నవ్వులతో చేసే సరదా అంతా ఇంత కాదు. ఆ వయసులో తల్లిదండ్రులను గుర్తుపట్టడం తక్కువనే చెప్పాలి. అయితే అనకాపల్లి జిల్లా కశింకోట మండలం ఉగ్గినపాలెం గ్రామానికి చెందిన ఓ బాలుడు అందరికీ భిన్నంగా ఉన్నాడు.ఏడాదికే అద్భుతమైన గ్రాహకశక్తితో నోబెల్ ప్రపంచ రికార్డ్ (నోబుల్ వరల్డ్ రికార్డు) సాధించాడు.
ఉగ్గినపాలెం గ్రామానికి చెందిన గాలి దృశ్యంత్ కుమార్ పేరు ఇప్పుడు గిన్నిస్ రికార్డు ఎక్కాడు.శ్రీదేవి,నాగేశ్వరరావు దంపతులకు ఏడాది కుమారుడు గాలి దృశ్యంత్ కుమార్ ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి ఆ బాలుడు ఎంతో యాక్టివ్‌గా ఉండటమే కాదు అద్భుతమైన గ్రాహక శక్తి ఉందని తల్లిదండ్రులు గుర్తించారు. రెండు నెలల నుంచి ఆ బాబుకు తల్లిదండ్రులు శిక్షణ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మూడు నెలల వయసులోకి వచ్చాక బాబు అనేక రకాల వస్తువులు, ఫోటోలు, దేశాలకు సంబంధించిన జెండాలను చూపిస్తూ శిక్షణ ఇచ్చారు. దీంతో ఆ బాబు క్రమంగా వస్తువులను గుర్తు పట్టడం, ఫోటోలను గుర్తించడం అలవాటు చేసుకుంది.

ఇప్పుడు బాబు వయసు ఏడాది కావస్తోంది. ఆ బాబు గ్రాహక శక్తిని చూసి తల్లిదండ్రులే కాదు, స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఏడాది బాబుకు సుమారుగా 3 వందల రకాల ఫోటోలను గుర్తించడమే కాకుండా వస్తువులు, పూలు, పళ్లు, కూరగాయలను తేలిగ్గా గుర్తుపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు బాబు గ్రాహక శక్తిని రికార్డ్ చేసి నోబెల్ ప్రపంచ రికార్డు కోసం పంపగా అనేక సంస్థలు చిన్నారికి అవార్డులు, మెడల్స్ ఇచ్చి అభినందించారు. నోబెల్ రికార్డు సాధించిన గాలి దృశ్యంత్ కుమార్ కు అందరూ ప్రశంసిస్తున్నారు. బుధవారం అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బి శెట్టి వెంకట సత్యవతి గాలి దృశ్యంత్ కుమార్ పిలిపించి సత్కరించి మెమోంట్ అందచేసారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చిన్నతనంలోనే ఇన్ని అద్భుతాలు చేస్తున్న బాలుడు భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సాధించి, అందరికీ ఆదర్శంగా నిలుస్తాడని ఆమె పేర్కొన్నారు.బాబుతో కొద్దిసేపు ఎంపీ ముచుట్టించారు. తల్లిదండ్రులను ఈ సందర్భంగా అభినందించి ఘనంగా సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement