Sunday, April 28, 2024

డాక్టర్లు నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైన సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొత్తపట్నం మండలం గుండమాల గ్రామానికి చెందిన సాయి భార్య రమ్య డెలివరీ కోసం ఒంగోలు రిమ్స్ లో ఐదు రోజుల క్రితం జాయిన్ అయ్యారు. నిండు గర్భిణి అవ్వటంతో డెలివరీకి సమయం పట్టదని రెండు రోజులు రిమ్స్ లో ఉంచారు. అయితే, మూడో రోజు ఆమెకు కాళ్లు నొప్పులు, తలనొప్పి రావడంతో సంబంధిత వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి కరోనా టెస్ట్ చేసి ఆమెకు కోవిడ్ లేదని నిర్ధారణ అయిన తర్వాత ఆపరేషన్ చేశారు.

అయితే, ఆపరేషన్ చేసినప్పటి నుంచి ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కడుపు ఉబ్బరం, కాలు వాయడంతో బాధితురాలి బంధువులు వైద్య సిబ్బందిని నిలదీశారు. డాక్టర్లు సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకుని వెళ్లి మరో ఆపరేషన్ చేసినట్టు బంధువులు చెబుతున్నారు. దీనిపై బంధువులు డాక్టర్లను నిలదీయడంతో సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో బాధితురాలు మృతి చెందింది. దీంతో ఆమె మృతికి కారణమైన డాక్టర్లు వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement