Sunday, April 28, 2024

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటానికి కారణాలేంటి ?

ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవటానికి కారణాలేమిటో చెప్పాలని కేంద్రం ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.- ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు… ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది.- పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం వివరాలు సమర్పించాలంది. తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బి.కృష్ణమోహన్​తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయడం లేదని పేర్కొంటూ అమలాపురానికి చెందిన న్యాయవాది వి.రమేశ్ చంద్రవర్మ హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.రామారావు వాదనలు వినిపించారు. ఏపీని ఆదుకునేందుకు అప్పటి ప్రధాని పార్లమెంట్​లో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈశాన్య , హిమాలయ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిన కేంద్రం.. ఏపీ విషయంలో హామీని నిలబెట్టుకోలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. పలు రాష్ట్రాలకు హోదా ఇచ్చినప్పుడు ఏపీ విషయంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. విభజనతో ఏపీ నష్టపోయిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఏఎస్కీ హరినాథ్ వాదనలు వినిపిస్తూ .. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు పెండింగ్​లో ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు ఏపీకి భౌగోళిక పరిస్థితుల విషయంలో తేడా ఉందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement