Saturday, December 7, 2024

Breaking: బైక్ ల‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు.. ముగ్గురు మృతి

ఆగి ఉన్న బైక్ లను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెంద‌గా, మరొక‌రు గాయ‌ప‌డ్డ విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పూళ్ల ద‌గ్గ‌ర ఆగి ఉన్న బైక్ ల‌ను ఆర్టీసీ బ‌స్సు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెంద‌గా, మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement