Tuesday, April 30, 2024

AP: బాధితులకు అండగా ఉంటాం.. కుట్రకోణం ఉంటే క్రిమినల్‌ చర్యలు.. వైవీ సుబ్బారెడ్డి

విశాఖపట్నం, నవంబర్‌ 21(ప్రభ న్యూస్‌ బ్యూరో): విశాఖ చేపలరేవులో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇవాళ ప్రమాద ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ఇప్పటికే సిఎం జగన్‌ ఆదేశించారని, ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ ఘటనలో కుట్రకోణం దాగి ఉందని తెలితే ఖచ్చితంగా క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు.

బోటు ఖరీదు రూ.30 నుంచి 50లక్షల వరకూ ఉన్నప్పటికీ అందులో 80శాతం ప్రభుత్వం భరిస్తుందని, పరిహరం గతంలో మాదిరిగా ఆలస్యం కాకుండా త్వరలోనే అందిస్తామన్నారు. మునిగిపోయిన బోట్లను తక్షణమే తొలగించాలని పోర్టు అధికారులను కోరామని, ఇతర బోట్లకు అడ్డంకి లేకుండా మునిగిన బోట్లను త్వరలో బయటకు తీస్తామన్నారు. ఈ ప్రమాద కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఏడుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారని, విచారణ కూడా వేగవంతంగా జరుగుతుందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదో అనే అంశంపై కూడా విచారణ చేపట్టాలని నగర పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ను ఆదేశించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement