Tuesday, April 30, 2024

సాగు నీటికి క‌ట‌క‌ట – ఎండుతున్న‌పంట‌ల‌తో రైతులు క‌న్నీరు..

అమరావతి, ఆంధ్రప్రభ: నాగార్జునసాగర్‌ కుడికాల్వ పరిధిలోని ఆయకట్టు- భూములకు నీరందకపోవటంతో రైతుల ఆందోళన తీవ్రతరమవుతోంది. పంటలన్నీ పాలు పోసుకుని దిగుబడినిచ్చేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో కాల్వల్లో నీరు నిలిచిపోవటంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటు-న్నారు. పంటలు చివరిదశకు వచ్చిన నేపథ్యం లో ఒక్క తడికి పూర్తిగా నీరిచ్చినా ఈ సీజన్‌లో గ-్టట-క్కు తామని చెబుతున్నారు. సాగర్‌ కుడి కాల్వ కింద పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో లక్షలాది ఎకరాల ఆయకట్టు- ఉంది. వరి, మొక్కజొన్న, మిర్చి పంటలకు పది రోజుల పాటు- చివరి తడికి నీళ్ళిస్తే దిగుబడులొస్తాయనీ, లేదంటే పంటంతా ఎండిపోయే ప్రమాదముందని ఆందో ళన వ్యక్తమవుతోంది. ఈనెల ఒకటో తేదీ కాల్వలకు నీటి సరఫరాను నిలుపుదల చేశారు. అంతకుముందు బుగ్గవాగా ద్వారా వదిలిన నీరంతా అడుగంటిపోయింది. ఉన్న కొద్ది పాటి నీటిని మోటార్ల సాయంతో ఉపయోగించుకోగా ఇప్పుడు ఒక్క చుక్క కూడా అందుబాటు-లో లేకుండా పోయింది. సాగర్‌ కుడికాల్వకు సాగునీరు వదలాలంటే ఇపుడు కృష్ణా బోర్డుతో పాటు- తెలంగాణ అనుమతులు అవసరం. సాగర కుడికాల్వకు 132 టీ-ఎంసీల కేటాయింపులుంటే ఇప్పటికే 197 టీ-ఎంసీలు వినియోగించుకున్నట్టు- అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వరదల సమయంలో నీటిని మినహాయించినా ఇప్పటికే కేటాయింపులకు మించి వాడుకున్నట్టు- నిర్దారణ కావటంతో సమస్యను పరిష్కరించటం జటిలంగా మారింది. దీనిపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కృష్ణాబోర్డుతో పాటు- తెలంగాణను ఒప్పించి నీరు విడుదల చేయించాలని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు జలవనరుల శాఖ తక్షణం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి తెలంగాణతో పాటు- కృష్ణా బోర్డును ఒప్పించాలని కోరుతున్నారు. నాగార్జునసాగర్‌లో వేసవికాలంలో తాగునీటి అవసరాల కోసం కనిష్టంగా 510 అడుగుల మేర నీటిని నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. ప్రొటోకాల్‌ ను ఉల్లంఘించి తాగునీటి అవసరాలకు ఉద్దేశించి నిల్వ చేసిన నీటిని సాగుకు కోసం విడుదల చేయటం సాధ్యం కాదు.510 అడుగుల కన్నా ఎక్కువకు ఎగువ నుంచి నీటిని నింపి విడుదల చేసేందుకు తెలంగాణ, కృష్ణా బోర్డులను ఒప్పించాల్సి ఉంది. సాగర్‌లో నీటి మట్టం 530 అడుగుల కన్నా తగ్గుముఖం పట్టటంతో జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా తెలంగాణ నీటి విడుదల ను నిలిపివేసింది. కుడి కాల్వ రెగ్యులేటర్‌ గేట్ల నుంచి నీటిని విడుదల చేయటం సాధ్యం కాదనీ, ఇప్పటికే కేటాయింపులకు మించి అదనంగా 50 శాతానికి ఎక్కువగా కుడికాల్వ పరిధిలో నీటిని వాడుకున్నారని తెలంగాణ చెబుతోంది. పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నందున వరదల సమయంలో విడుదల చేసిన 50 టీ-ఎంసీలను మినహాయించి నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. దీనిపై కూడా తెలంగాణ సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు ఒక వైపు తెలంగాణతో, మరోవైపు కృష్ణా బోర్డు అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్టు- తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement