Sunday, April 28, 2024

ఎంపిగా క‌ళా, ఎమ్మెల్యేలుగా అశోక్ గ‌జ‌ప‌తి, రామ్మోహ‌న్ నాయుడు పోటీ..

అమరావతి, ఆంధ్రప్రభ : ఉత్తరాంధ్రపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన తెలుగు దేశం పార్టీ అక్కడ బలపడేందుకు కొత్త ఎత్తులను రచిస్తుంది. గతంలో ఉన్న పట్టును చేజార్చుకున్న ఆపార్టీ ఇప్పుడు పూర్త వైభవం కోసం సరికొత్త వ్యూహాల ను రచిస్తూ వాటిని అమలుచేసే దిశగా సన్నాహాలు మొదలుపెట్టింది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఉత్తరాంధ్రలో మెజార్టీ సీట్లను హస్తగతం చేసుకుంటే అధికారం ఖాయమన్న భావనలో ఆపార్టీ ఉంది. ఈనేపథ్యంలో టీడీపీ అధినే త చంద్రబాబు ఆప్రాంత రాజకీయ పరిస్థితులపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి తన చాణక్యానికి పదునుపెడుతున్నారు. ఒకవైపు సర్వేలు మరోవైపు పార్టీ నివేదికలతోపాటు థర్డ్‌పార్టీ నివేదికలను పరిగణలోకి తీసుకుంటూ నియోజక వర్గాల్లో మార్పులు, చేర్పులు దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావును ఈసారి ఎంపీగా బరి లోకి దింపాలన్న యోచనలో ఆపార్టీ ఉన్నట్లుగా తెలు స్తుంది. ఆది నుండి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెం బ్లి నుండి బరిలోకి దిగుతున్న ఆయన ఈసారి విజయనగరం నుండి పార్ల మెంటు నుండి బరిలోకి దిం పేందుకు ఆలోచన చేస్తున్నారు. అయి తే, ఇప్పటి వరకూ అక్కడ నుండి పోటీచేస్తున్న మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజును దాదాపుగా అసెంబ్లికి పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే అధిష్టానానికి కూడా ఈ అంశాన్ని వివరించడంతోపాటు గ్రీన్‌ సిగ్నల్‌ పొందినట్లుగా వార్తలు వినిపిస్తున్నా యి.

ఈనేపథ్యంలోనే ఎలాంటి విబేధా లు, వివాదాలు లేని కళా వెంకట్రావును అక్కడ నుండి పోటీచేయిస్తే విజయం ఖాయమన్న ధీమాలో తెలుగుదేశం పార్టీ ఉంది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పార్టీ నేతలకు, సీనియర్లకు టిక్కెట్ల కేటాయింపు అంశం పై పూర్తిస్థాయిలో స్పష్టతనిచ్చారు. కుటుంబానికి ఒక్క సీటేనని తేల్చి చెప్పారు. దీంతో విజయనగరం అసెంబ్లి ఎన్నికల్లో అశోక్‌ గజపతి రాజు గానీ, ఆయన కుమార్తె బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ శ్రీకాకుళం నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన యువనేత రామ్మోహన్‌ నాయుడు ఈసారి అసెంబ్లి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయానికి దాదాపుగా వచ్చారు. అధిష్టానంపై ఈమేరకు వత్తిడి కూడా తీసుకువస్తున్నారు. నరసన్న పేట నియోజకవర్గం నుండి పోటీ చేయాలని యోచిస్తున్న ఆయన తన స్పష్టమైన అభిప్రాయాన్ని పార్టీ అధినేతకు ఇప్పటికే తెలియజేశారు. అయితే, దీనిపై ఇంకా చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ఎంపీ రామ్మోహన్‌ నాయుడుతో అధిష్టానం మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఎచ్చెర్ల నుండి బరిలోకి కొత్త నేత
ఎచ్చెర్ల అసెంబ్లి స్థానంలో కొత్త అభ్యర్ధిని బరిలోకి దింపాలన్న యోచనలో తెదేపా ఉంది. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కళా వెంకట్రావును విజయనగరంకు మార్చుతున్న పరిస్థితుల్లో అక్కడ నుం డి కలిశెట్టి అప్పల నాయుడును పోటీకి దింపాలని భావిస్తున్నట్లుగా సమాచా రం. మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌గా పార్టీ ఉత్తరాంధ్ర శిక్షణా తరగతుల ఛైర్మన్‌గా వ్యవహరించిన అప్పల నాయుడు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు పూర్తిస్థాయిలో కొనసాగిస్తూ అధిష్టానం దృష్టిలో పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్‌కు గుడిని కట్టించే కార్యక్రమానికి కూడా ఆయన శ్రీకారం చుట్టారు. వివాద రహితుడుగా, పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్న ఆయనకు ఈసారి అవకాశం కల్పించే యోచనలో తెదేపా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement