Monday, April 29, 2024

War Begin – ఏపీలో స్పీండ‌దుకున్న పాలిటిక్స్.. దూకుడుగా నేత‌లు

(ఆంధ్రప్రభ స్మార్ట్, అమరావతి ప్రతినిధి) – ఏపీలో ఎన్నికల రణరంగానికి ప్రధాన రాజకీయ పార్టీలు కదం తొక్కుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలను మట్టి కరిపించాలనే ధ్యేయంతో అధికార వైసీపీనేత, సీఎం జగన్యుద్ధానికి సిద్ధం అంటూ సమర శంఖారావాన్ని పూరిస్తుండగా.. తమ పసుపు సేన కదన చైతన్యానికి ప్రధాన ఉమ్మడి ప్రతిపక్షం టీడీపీ, జనసేన ఉవ్విళ్లూరుతూ… రా కదలి రా అని పిలుపును ఇస్తున్నాయి. ఇక గత పదేళ్లుగా అంపశయ్యపై కోమాలో కొట్టిమిట్టాడిన కాంగ్రెస్పార్టీ సైతం.. తమ సైనికులల్లో పునరుత్తేజానికి కంకణం కట్టుకుని ఊరూరా పర్యటనలు ప్రారంభించింది. ఒకే రోజున ఈ మూడు పార్టీలు తమ కార్యక్రమాలతో జనంలోకి దూసుకు పోతున్నాయి. బీమిలీలో సీఎం జగన్ప్రభుత్వ అనుకూల ఓటును బ్యాంకును పదిల పర్చే క్రతువుకు సిద్ధం అయ్యారు. కడప, అనంతపురం జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరాసభకు సన్నద్ధమయ్యారు. ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్షర్మిలాఎక్కడాతగ్గటంలేదు. శనివారంబాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఏతావాతా .. ఈ మూడు పార్టీలు ఎన్నికల జాతరకు శ్రీకారం చుట్టాయంటే… అతిశయోక్తి కాదు.

ఎన్నికల వరాలకు సీఎం జగన్ సిద్ధం …

ఏపీలో 2024 ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల జోష్తోసీఎంజగన్ శంఖారావం మార్మోగనుంది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో భారీ సభకు వైసీపీ సర్వ సన్నద్ధమైంది. ఈ సభలో వైసీపీ కేడర్ కు సీఎం జగన్దిశా నిర్దేశం చేస్తారు. ఎన్నికల వరాలను ప్రకటిస్తారు. తాను అమలు చేసిన సంక్షేమ ఫలాల రుచిని వివరిస్తారు. ప్రతిపక్షాల ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పి కొట్టనున్నారు. సభకు పెద్ద ఎత్తున జనం బయలుదేరారు. ర్యాంప్ వాక్ తో కార్యకర్తల మధ్యకు జగన్ వెళ్తూ ప్రసంగించేలా సర్వం సిద్దం చేసారు.భీమిలిలో జన సంద్రం హోరు వినిపించేలా… ఈ సభను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అంతే కాదు, విపక్ష పార్టీల ఆరోపణలు..కుమ్మక్కు రాజకీయాలు..తెర వెనుక వ్యవహారాలను వివరిస్తూ..మరోసారి గెలిచేందుకు ఎలా వ్యవహరించాలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.ఈ సభా వేదిక నుంచి ఈ 56 నెలల కాలంలో తన ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం గురించి సీఎం జగన్ వివరించనున్నారు.ఈ సభకు లక్షలాది మంది తరలి వచ్చేలా ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు పథకం రచించారు. భారీగా జన సమీకరణ చేశారు. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు ఈ సభకు హాజరు కానున్నారు.

పసుపు దళపతి శంఖారావం

ఇప్పటికే రా కదలి రా పేరిట ఎన్నికల ప్రచారంతో తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం ఉరకలు తొక్కుతోంది. అధికార పార్టీపై టీడీపీ అధినేత నిప్పుల వర్షం కురిపిస్తున్నారు. ఒకవైపు విశాఖ జిల్లా భీమిలిలో అధికార పార్టీ వైసీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగా… ఇందుకు పోటీగా చంద్రబాబు కూడా తమ రథాన్ని పరుగులు తీయిస్తున్నారు. శనివారం నుంచి 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ‘రా కదలి రా’ బహిరంగ సభల నిర్వహణకు సన్నద్ధమయ్యారు. శనివారం పీలేరు, ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలు దేరిన చంద్రబాబు తిరుపతి చేరుకున్నారు. ఇక తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో పీలేరు మండలంలోని వేపులబయలుకు చేరుకున్నారు. అనంతరం సాయంత్రం ఉరవకొండ బహిరంగ సభలో పాల్గొంటారు. 28న నెల్లూరు రూరల్, పత్తికొండల్లో29న రాజమండ్రి రూరల్, పొన్నూరులో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు.

- Advertisement -

ఇక జనంలో షర్మిల వాగ్భాణాలు

పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన షర్మిలరెడ్డి పక్కా వ్యూహంతో జనంలోకి వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మబంధువుగా పేరొందిన కేవీ రామచంద్రరావు షర్మిల వెన్నంటే ఉంటున్నారు. అడుగడుగునా ఆమెకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. వైసీపీలో సీట్లు రాని నాయకులు, అధికార పక్షంపై అసమ్మతి వర్గం.. కాంగ్రెస్ గూటిలో చేరుతుంటే… షర్మిలా ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటనలు ప్రారంభించారు. వైసీపీలో అంతర్గత పేచీలకు చిరునామాగా మారిన బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో శనివారం పర్యటిస్తున్నారు. ఇక షర్మిల తన దైన శైలిలో ప్రసంగాలు చేస్తూ.. వైసీపీలోనే కాదు, టీడీపీ, జనసేన, బీజేపీలను ఉతికి ఆరేస్తున్నారు. బీ అంటే బాబు, జే జగన్ , పీ పవన్ అని సెటైర్లు గుప్పిస్తున్నారు. టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులందరూ బీజేపీ కట్టు బానిసలని వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా దక్కనీయని ఈ పార్టీలను ఎండగడుతానని, సీఎం జగన్పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి హోరాహోరీ మాట యుద్ధానికి ఏపీ ఓ వేదిక కానుంది. ఎవరి వ్యాఖ్యలు ఎలా ఉంటాయో? అనే ఉత్కంఠతతో రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement