Sunday, April 28, 2024

విశాఖ‌లో జి 20 సంద‌డి..

విశాఖపట్నం-ఆంధ్రప్రభబ్యూరో:విశాఖనగరం మరో అంతర్జాతీయ వేదికకు ఆతిధ్యం ఇవ్వబోతుంది. గతంలో అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ, ఆ తరువాత మిలాన్‌ వంటి భారీ కార్యక్రమాలకు విశాఖ వేదిక కావడం, వాటిని సమర్ధవం తం గా నిర్వహించి ప్రపంచ దేశాల ప్రశంసలు పొందడం జరి గిం ది. ఆ తరువాత అనేక జాతీయ, అంతర్జాతీయ సమా వేశాల కు విశాఖ పలుమార్లు ఆతిధ్యం ఇచ్చి ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసిన ఘనత కూడా దక్కించు కుం ది. ఈ నేపధ్యంలోనే ప్రతిష్టాత్మకమైన జీ-20 సమావేశా లకు విశాఖ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది.మార్చి 28, 29 తేదీలలో జీ-20 సమావేశాలు జరగనున్నాయి. దీం తో రా ష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాలకు సంబంధించి భారీ ఏ ర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడా ఎటువంటిలో టు పాట్లు లేకుండా నగరం రూపురేఖలు మార్చే విధంగా సుంద రీకరణ పనులు ఇప్పటికే చేపట్టి వేగ వంతం చేశారు. పచ్చ ద నం, ప్రకృతి పరవళ్లుతో పాటు పర్యా టకులకు కను విందు చేసే స్వర్గదామంగా విశాఖ ముస్తాబవు తుంది.

రూ.120 కోట్లతో అభివృద్ధి పనులు
జీ-20 సమావేశాల నేపధ్యంలో సుమారు రూ.120 కోట్లతో వేర్వేరు అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభించారు. ప్రధానంగా సమావేశాలు నిర్వ హణ, ఆతిద్యమిచ్చే హోటల్స్‌ వద్ద ఎటువంటి లోటు పాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరానికి రానున్న విదేశీయ ప్రతినిధులు పర్యటించే ప్రతీ ప్రాంతంలోనూ పచ్చని ప్రకృతితో పాటు విశాఖ అందచందాలు చూసి ఆశ్చర్యం చెందే విధంగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా మహావిశాఖ నగరపాలక సంస్థ, ఆంద్రప్రదేశ్‌ అర్బన్‌ గ్రీన్‌ అండ్‌ బ్యూటీఫికేషన్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా సుమారు రూ.27 కోట్లతో నగరాన్ని పూర్తిస్థాయిలో గ్రీనరీగా మార్పు చేసేందుకు శరవేగంతో పనులు చేపడుతున్నారు. గ్రేటర్‌ కమిషనర్‌ పి.రాజాబాబు పర్యవేక్షణలో అదనపు కమిషనర్‌ యాదగిరి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సుందరీకరణ పనులు పూర్తి చేస్తున్నారు. జీవీఎంసీ ఉద్యానవన విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ దామోదర్‌, తన అధికారులు, సిబ్బందితో ఈ పనులను దగ్గరుండి పూర్తి చేయిస్తున్నారు. ఇందు కోసం అదనంగా జోనల్‌ కమిషనర్‌ స్థాయి అధికారి చక్రవర్తిని పూర్తిస్థాయిలో నియమించారు. ఎక్కడికక్కడ అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి రాత్రి, పగలు బ్యూటిఫికేషన్‌ పనులు చేపట్టేలా చర్యలు చేపట్టారు. విశాఖ విమానాశ్రయం నుంచి తాటిచెట్లపాలెం జంక్షన్‌ వరకు, అక్కడ నుంచి సిరిపురం మీదుగా బీచ్‌రోడ్డు వరకు, నేవల్‌ కోస్టల్‌ బేటరీ జంక్షన్‌ నుంచి భీమిలి వరకు మూడు దశల్లో ఈ గ్రీనరీ పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా పొడవాటి సముద్రతీరం పొడవున క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పనులు వేగవం తం చేశారు. బీచ్‌రోడ్డులో సెంటర్‌ మీడి యన్స్‌ (మధ్యభాగం), బీచ్‌ ఫ్రంట్‌ ప్రాంతా ల్లో అందం గా తీర్చిదిద్దే పనులు చేపడుతు న్నారు. ప్రధానంగా గార్డెన్‌ బెంచ్‌లు ఏర్పా టు చేయడం, రకరకాల బొమ్మలుతో సుంద రీ కరణ పనులు చేపట్టడం, అందమైన శిల్పా లుతో కూడిన విగ్ర హాలు నెలకొల్పు తున్నా రు.ఇక సాగర్‌నగర్‌, ఇస్కాన్‌ ప్రాంతాల్లో సుమారు 250 ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మాదిరిగా కొబ్బరి మొక్కలు నాటి అవి ఏళ్ల తరబడి పెరిగే వరకు చూసే పరిస్థితి లేకుండా ఇప్పుడు ట్రాన్స్‌ లోకేషన్‌ పేరిట తాత్కాలికంగా భారీగా , ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లను విశాఖ బీచ్‌రోడ్డులో ఇప్పటికే ఏర్పాటు చేశారు. మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖనగరం మరో అంతర్జాతీయ వేదికకు ఆతిధ్యం ఇవ్వబోతుంది.

ఎక్క‌డ చూసినా అభివృద్ధి ప‌నులు
ఒక్క గ్రీనరీకే పరిమితం కాకుండా జీ-20 సమావేశాలకు సంబంధించిన అన్ని ప్రాంతాలను కనీవిని ఎరు గని రీతిలో ముస్తాబు చేస్తున్నారు. నిధులకు ఏ మాత్రం వెనుకంజ వేయ కుండా ఒక్క జీవీఎంసీ నుంచే సుమారు రూ.75 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఆ తరువాత మిగిలిన విభాగాలు ఈ అభివృద్ధి పనుల్లో భాగస్వాముల య్యారు. జీ-20 సమావేశాలు రెండు రోజుల పాటు జరగనుండగా ఆయా దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు సమా వేశాలు అనంతరం సింహాచలంతో పాటు అరకు, ఇతర పర్యాటక ప్రాంతాలను, దేశంలోనే రెండో మున్సిపాలిటీగా పేరుగాంచిన భీమిలి ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే విశాఖ నుంచి అరుకు వరకు, ఇటు నగరం మధ్య నుంచి అటు భీమిలి వరకు, మరో వైపు సింహాచలం వైపు ఇలా అన్ని ప్రాంతాల్లో అభివృద్ది పనులు చేపడుతున్నారు. సుమారు 250 మంది విదేశీయ ప్రతినిధులు నగరానికి రానుండడంతో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జిల్లా కలెక్టర్‌ ఏ.మల్లిఖార్జున పర్యవేక్షణలో గ్రేటర్‌ కమిషనర్‌ పి.రాజాబాబు, నగర పోలీస్‌ కమిషనర్‌ సిహెచ్‌ శ్రీకాంత్‌తో పాటు అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం విశాఖలో ఎటు చూసినా జీ-20 సమావేశాల సందడే కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని రకాల అభివృద్ధి పనులు ప్రారంభమ య్యాయి. ఆయా పనులను అధికార యంత్రాంగం ఒక యజ్ఞంలా పూర్తి చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement