Monday, May 6, 2024

పర్యావరణంలో విశాఖ‌కు 4 స్టార్ రేటింగ్ : మేయర్ ను కలిసిన కమిషనర్

విశాఖపట్నం : స్మార్ట్ సిటీ అసెస్ మెంట్ ఫ్రేమ్ వ‌ర్క్ 2.0 లో విశాఖకు 4వ స్టార్ రేటింగ్ వచ్చిన సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మిశ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారిని కలిశారు. శనివారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె చాంబర్ లో పర్యావరణంలో 4 స్టార్ రేటింగ్ లో వచ్చిన అవార్డులను నగర మేయర్ కు చూపించారు. ఈ సందర్భంగా కమిషనర్ సూరత్ లో పర్యావరణంపై అవలంబిస్తున్నపద్ధతులను మేయర్ కు వివరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్ సిటీ ఎసెస్ మెంట్ ఫ్రేమ్ వ‌ర్క్ 2.0 లో విశాఖకు 4 స్టార్ రేటింగ్ రావడంపై మేయర్ కమిషనర్ ను అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో అధికారుల నుండి కార్పొరేటర్ల వరకు టీం వర్క్ గా పని చేయాలని, అందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారంలో ఒకరోజు ఆఫీసుకు సైకిల్ ను, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించి రావడం తదితర అంశాలపై దృష్టిసారించాల‌ని తెలిపారు. మోటార్ వాహనాల వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హితమైన సోలార్ ను, బ్యాటరీ వాహనాలను ఉపయోగించడం ద్వారా కొంతవరకైనా పర్యావరణాన్ని కాపాడగలుతామని ఆమె తెలిపారు. కమిషనర్ తెలిపిన విధంగా పర్యావరణం పరిరక్షణ కోసం కౌన్సిల్ లో కొన్ని తీర్మానాలు చేయవలసిన అవసరం ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement