Thursday, May 2, 2024

గ్యాస్‌ సిలిండర్‌ పేలి… సర్వం కోల్పోయిన బాధితులు

కల్లూరు, ప్రభన్యూస్‌ : ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఆరు గుడిసెలు దగ్ధమైన ఘటన శనివారం కర్నూలు నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని, నంద్యాల చెక్‌ పోస్ట్‌ సమీపంలో శనివారం మధ్యాహ్నం సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. మంటలు వ్యాపించడంతో దాదాపు ఆరు గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జీవనాధారమైన ప్రతీది కాలి, భూడిదయ్యాయి.

విషయం తెలియగానే పాణ్యం ఎమ్యెల్యే, టీ-టీ-డీ ధర్మకర్తల మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, కర్నూలు నగర మేయర్‌ .బి.వై.రామయ్య, కల్లూరు తహసీల్దార్‌ రమేష్‌ బాబు, సంఘటన స్థలానికి చేరుకుని సంఘటన ఎలా జరిగింది అన్న విషయాన్ని స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

సిలిండర్‌ మధ్యాహ్నం సమయంలో పేలింది. ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు తమ వంతుగా సహాయ, సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు, ప్రస్తుతానికి ఒక్కో కుటుంబానికి ఒక బియ్యం ప్యాకెట్‌ను అందజేశారు. ఎమ్యెల్యే, మేయర్‌, తహసీల్దార్‌, స్థానిక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement