Thursday, May 9, 2024

తుంగభద్ర నీటి విడుద‌ల… ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి..

కర్నూలు, (ప్రభన్యూస్‌): తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్‌డిఓలు, తహశీల్దార్‌లు, ఎంపిడిఓలను కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. తుంగభద్ర డ్యాం నుంచి 90 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారని, లక్ష క్యూసెక్కుల వరకు నీరు విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నదిలో ప్రవాహం తగ్గే వరకు నది సమీప ప్రాంతాలకు పిల్లలు, గొర్రెలు, పశువులు, మేకలు కాపరులు వెళ్లకుండా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

పంచాయితీ కార్యదర్శులు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓలు ఆదేశించారు. తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కనుక స్నానానికి మాల ధరించిన భక్తులు నదిలోకి వెళ్లోదని హెచ్చరికలు జారీ చేయాలన్నారు. కోసిగి, కౌతాళం, పెద్ద కడుబూరు, సిబెళగల్‌, మంత్రాలయం, గూడూరు, కొత్తపల్లె, కర్నూలు అర్బన్‌, రూరల్‌ మండలాల తహసీల్దార్‌లు, ఎంపిడిఓ లతో మండలాల వారిగా కలెక్టర్‌ సమీక్షించారు. కలెక్టర్‌లోని వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో డిఆర్‌ఓ పుల్లయ్య, డిపిఓ ప్రభాకర్‌రావు, విపత్తుల నిర్వహణ డిపిఎం తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement