Saturday, April 27, 2024

AP: చంద్రబాబుకు ‘‘జయ జయోస్తు”.. గ్రంథాన్ని ఆవిష్కరించిన వేమిరెడ్డి

అపురూప భక్తి సేవకు మరొకసారి నెల్లూరులో తెరలేచినట్లైంది. రెండు రాష్ట్రాల్లో మూడు మాసాలుగా వందలకొలది అనేక ఆలయాల అర్చక , పండిత వర్గాల్ని, పారాయణ పరాయణుల్ని , భక్త పాఠకుల్ని విశేషణగా ఆకర్షిస్తూ.. ఆకట్టుకుంటోన్న ‘జయ జయోస్తు’ అద్భుత గ్రంధాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు, నెల్లూరు తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, కోవూరు తెలుగుదేశం శాసన సభ అభ్యర్థి , టి.టి.డి. సలహామండలి చైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఆవిష్కరించారు.

- Advertisement -

ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలన గ్రంధం ‘ జయజయోస్తు ‘ మంత్ర వైభవ మహాగ్రంధాన్ని వేమిరెడ్డి దంపతులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ .. పరమాత్మ స్వరూపాన్ని నిరూపించే మంత్రవిద్యల గొప్ప సత్యాలతో రూపొందించిన ఈ ‘ జయ జయోస్తు ‘ గ్రంధం సర్వకాల సర్వావస్థలలో పారాయణం చేసుకునేలా.. సౌందర్యమయ వ్యాఖ్యానాలతో అందించిన పురాణపండ శ్రీనివాస్ మంత్ర నిష్ఠను , రచనా వైభవాన్ని అభినందించారు.

శంఖాలు, దుందుభులూ, మేఘగర్జనల్లాంటి జయ జయ ధ్వనుల మంత్రాలన్నీ ఈ ‘ జయ జయోస్తు ‘ లో ఉండటం … ఈ సమయంలో ఈ దివ్య కార్యాన్ని ఆవిష్కరించడం చంద్రబాబు విజయానికి ‘ జయ జయోస్తులా పలుకుతున్నట్లుందని ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. తెలుగునాట కొన్ని సంవత్సరాలుగా ఒక పుస్తకం వెనుక మరొక పుస్తకం చొప్పున సాహిత్య , ఆధ్యాత్మిక గ్రంధాలను వ్యాపార తాకిడులు లేకుండా .. పూర్తిగా నిస్వార్ధంగా అద్భుత రీతిలో అందించడంలో పురాణపండ శ్రీనివాస్ అగ్రశ్రేణిలో ఉండటం వల్లనే … రెండు రాష్ట్రాల్లో పురాణపండ శ్రీనివాస్ ధార్మిక గ్రంధాలకు ఊహాతీతమైన స్పందన సంవత్సరాలుగా లభిస్తూనే ఉందనే విషయం మన కన్నులముందే స్ఫుటంగా కనిపిస్తున్న సత్యం.

తమ స్వహస్తాల వేమిరెడ్డి దంపతులు ఎందరో భక్తులకు అందజేయడం భక్త జనులకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఎంతో ఆనందం కలిగించింది. త్వరలోనే ఈ ‘జయ జయోస్తు ‘ అద్భుత అమోఘ మంత్ర కదంబాన్ని నెల్లూరు మాత్రమే కాకుండా చుట్టు ప్రక్కల ప్రాంతాల అనేక ఆలయాలకు , తెలుగుదేశం పార్టీ అధినాయకుని క్షేమంకోరి వేలాది భక్త శ్రేణులకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి అందజేస్తారని పార్టీశ్రేణులు సమాచారం. జయ జయోస్తు గ్రంధాన్ని వేమిరెడ్డి దంపతుల నుండి స్వీకరించిన భక్త జనం, సాహితీ మిత్రులు అక్కడికక్కడే పారాయణం చెయ్యడం విశేషంగా కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement