Thursday, May 9, 2024

వివేకా హ‌త్య కేసు – ఎంపి అవినాష్ ముఖ్య అనుచ‌రుడు ఉద‌య్ అరెస్ట్..

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులోఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్‌కుమార్‌ రెడ్డి సిబిఐ నేటి ఉద‌యం అరెస్ట్ చేసింది.. అలాగే అతడి తండ్రి జయప్రకాశ్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. కానీ ఇంత‌వ‌ర‌కు అరెస్ట్ చూప‌లేదు.. పులివెందుల నుంచి కడప కారాగారం అతిథిగృహానికి ఉదయ్‌ను తీసుకెళ్లి విచారించిన అనంత‌రం అరెస్ట్ చేసిన ఉద‌య్ కుమార్ రెడ్డిని క‌డ‌ప నుంచి హైద‌రాబాద్ కు సిబిఐ త‌ర‌లించింది.. ఇప్ప‌టికే ఈ కేసులో ఉద‌య్ ను ప‌లుమార్లు విచారించింది సిబిఐ.. కాగా,గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా ఎంపీ తండ్రి భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉదయ్‌ ఉన్నట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు అవినాష్‌, శివశంకర్‌ రెడ్డితో పాటు ఘటనాస్థలికి ఉదయ్‌ వెళ్లినట్లు.ఆ రోజు అంబులెన్స్‌, ఫ్రీజర్‌, వైద్యులను రప్పించడంలో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ భావిస్తోంది. వివేకా మృతదేహానికి ఉదయ్‌ తండ్రి జయప్రకాశ్‌ రెడ్డి బ్యాండేజ్‌ కట్లు కట్టినట్లు ఆరోపణలున్నాయి. జ‌య‌ప్ర‌కాష్ ను కూడా అరెస్ట్ చేసే అవ‌కాశాలున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement