Monday, April 29, 2024

AP | ఈవారంలోనే వారికి బదిలీలు.. డిస్టెన్స్‌, స్పౌజ్‌ కేసులకు ఇంపార్టెన్స్​

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు, చెవులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులేనని.. వారి సౌలభ్యం, పనితీరులో మెరుగైన ఫలితాలకోసం వారికి బదిలీల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి లక్ష్మీ షా చెప్పారు. ఈమేరకు బుధవారం ఆయన ‘ఆంధ్రప్రభ’తో వివిధ అంశాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉన్న జీవోను ఈనెలాఖరు వరకూ ఎత్తివేసిన నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల ప్రక్రియనే వేగవంతం చేశామని తెలిపారు. ఇప్పటికే బదిలీల ప్రక్రియకు సంబంధించి ఆర్ధిక శాఖ అనుమతులు వచ్చిన నేపథ్యంలో విధివిధానాలు రూపొందించి ప్రభుత్వానికి పంపామని, ఈవారం చివరిలో జీవో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

పూర్తి పారదర్శకతో ఈ బదిలీల ప్రక్రియను ఆన్‌లైన్‌ విధానం ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. దూరం, భార్యభర్తలకు సంబంధించిన రెండు అంశాలకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పారు. ఉద్యోగి సమస్యను పరిష్కరిస్తే ఆ ఉద్యోగి నూరు శాతం పనిపై దృష్టిపెట్టి పనిచేసే అవకాశముందని, దానిని దృష్టిలో ఉంచుకుని బదిలీల నిర్వహణలో ఎవరికీ అన్యాయం జరగకూడదన్న నిర్ణయంతో విధివిధానాలు రూపొందిచామని తెలిపారు. ఇంటర్‌ జిల్లాల బదిలీలకు సంబంధించి ఉద్యోగి వెళ్లాలనుకునే జిల్లాలో చివరి ర్యాంకు ఇస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement