Sunday, October 13, 2024

Breaking : నంద్యాల అవుకు టన్నెల్ వద్ద విషాదం.. బండ‌రాళ్లు ప‌డి ఒక‌రు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఘోరం జ‌రిగింది. అవుకు టన్నల్ పనుల్లో భాగంగా బండరాళ్లు పడి ఒక‌రు చ‌నిపోయారు. ఈ ఘటన ఇవ్వాల (మంగళవారం( సాయంత్రం చోటుచేసుకుంది. నంద్యాల మండ‌లం అవుకు టన‌నెల్ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రొక్లెయిన‌ర్‌తో సొరంగం తవ్వుతుండగా ప్రమాదవశాత్తు బండరాళ్లు పడ్డాయి. దీంతో ఆపరేటర్ మద్దిలేటి స్వామి (25 )పై రాళ్లు ప‌డ‌డంతో అక్కడికక్కడే చ‌నిపోయాడు. మృతుడు బేతంచెర్ల మండలం గొర్లగుట్ట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement