Friday, April 26, 2024

Tirupathi – ఆర్టీసీ బస్సు – కారు ఢీ… ముగ్గురి దుర్మరణం

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి- శ్రీకాళహస్తి ప్రధాన రహదారిలో ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది .

ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు మృతిచెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లె వాసులుగా గుర్తించారు. ఘటనాస్థలంలో ఏర్పేడు సీఐ శ్రీహరి, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement