Thursday, April 25, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 6 (ఆడియోతో…)

భాగవతం, అష్టమ స్కందంలోని ఋషి ప్రభోదం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

పుం సోయం సంసృతే: హేతు: అసంతోష: అర్థకామయో
ఎదృచ్ఛయోపపన్నేన సంతోష: ముక్తయే స్మృత:

పురుషుడు తాను అనుభవిస్తున్న అర్థకామములలో అసంతృప్తే సంసారానికి కారణం. దైవ వశం వలన లభించిన దానితో సంతోషించకలుగుట మోక్షమునకు కారణం.

మానవుడు తనకు లభించిన వాటితో అర్ధకామములతో అనగా ధనము, దార(స్త్రీ)లతో తృప్తి పొందక వాటి కోసం నిరంతరం ప్రయత్నిస్తూ కోరికలను పెంచుకోవడమే పుట్టుకకు కారణం. తృప్తి లేనివారికే కోరికలు పెరుగుతాయి అనగా అసంతృప్తి సంసారానికి కార ణం. భగవంతుడు ఇచ్చిన దానితో సంతోషాన్ని పొందిన వారికి సంసారం తొలగి మోక్షం లభిస్తుంది. అందుకనే అసంతృప్తి సంసారానికి హేతువు , సంతృప్తి మోక్షానికి హేతువు అని భాగవతం అష్టమ స్కందంలో వివరించబడినది.

- Advertisement -

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement