Monday, April 29, 2024

AP Assembly: మూడో రోజు ఏపీ అసెంబ్లీ…ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌..

ఇవాళ మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తయారుచేశారు. సభలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్జేయూకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధ సవరణ) బిల్లు -2024, ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024 సభ ముందుకు తేనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement