Saturday, May 4, 2024

కొల్లేరు పరిరక్షణకు వడివడిగా అడుగులు.. ఉప్పు నీటి ప్రభావం నుంచి ఉపశమనం..

కృష్ణా, ప్రభన్యూస్ : కొల్లేరు మంచినీటి సరస్సుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సముద్ర ముఖద్వారం వద్ద మూడు రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రూ.312 కోట్లు నిధులు మంజూరు చేసింది. గత దశాబ్దకాలంగా కొల్లేరులో రెగ్యులేటర్లు, గరిశపూడి వద్ద అండర్‌ టర్నల్‌ నిర్మాణం చేయాలనే డిమాండ్‌ కార్యరూపం దాల్చనున్నది. మంచి నీటి సరస్సుగా పేరొందిన కొల్లేరు ఉప్పుమయమైంది. దీనితో పర్యావరణం దెబ్బతినకుండా సరస్సు సజీవంగా ఉండేలా రెగ్యులేటర్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడంతో కొల్లేరు సరస్సు పూర్వవైభవం రావడంతో పాటు ఆ ప్రాంత సాగునీటి సమస్యకు పరిష్కారం లభించనున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement