Saturday, May 4, 2024

వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కర్నూలు: ఆదిమూలపు సురేష్

రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కర్నూలు మొదటి స్థానంలో ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఇవ్వాల (సోమవారం) మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో మొదటిసారి కర్నూలు పర్యటనకు వచ్చారు. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ అర్బన్ హెల్త్ సెంటర్లు, సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పనలో మేయర్, కమిషనర్, ఎమ్మెల్యేలు మార్క్ చూపించారన్నారు. ప్లాస్టిక్ నిర్ములన, పరిశుభ్రమైన నగరం, పచ్చని చెట్ల పెంపకం వంటి వాటిల్లో కర్నూలు స్పూర్తిగా నిలిచిందన్నారు. కర్నూలు నగరాభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ఇందులో ఎటువంటి సందేహాం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement