Sunday, May 5, 2024

Bad News: సాంబార్ గిన్నెలో పడిన చిన్నారి.. బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రుగుతుంగానే..

కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం కలగరలో విషాదం నెల‌కొంది. పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుగుతుండ‌గానే ఆ చిన్నారి ప్ర‌మాద‌వ‌శాత్తు సాంబ‌ర్ గిన్నెలో ప‌డిపోయింది.

కారుమంచి శివ, బన్ను దంపతులకు రెండు సంవత్సరాల పాప ఉంది. వారి ముద్దుల పాప తేజస్వినికి పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు. అయితే భోజనాలు జరిగే ప్రాంతంలో కుర్చీలో ఆడుకుంటున్న‌ తేజస్విని కుర్చీలో నుంచి జారీ సాంబార్ గిన్నెలో ప‌డిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు అప్ప‌టిక‌ప్పుడు తిరువూరులోని ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. అక్క‌డ వైద్యం చేయించి డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. కాగా, ఆ పాప చికిత్స పొందుతూ ఇవ్వాల ఉద‌యం చ‌నిపోయింది. పుట్టిన రోజునాడు వేడుక‌ల‌ప్పుడు అంతా సంతోషంలో ఉండ‌గా ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement