Monday, April 29, 2024

మాజీ ప్రధాని వాజ్ పేయీ వ్యక్తి కాదు వ్యవస్థ

భారత మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్ పేయీ వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని బీజేపీ రాజ్యసభ్య సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. శనివారం వాజ్ పెయ్ జయంతి సందర్భంగా కర్నూల్ లో నిర్వహించిన సుపరిపాలన దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజ్పేయి పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఉంటే పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా ఆయన ప్రసంగాన్ని వినేవారని గుర్తు చేశారు. వాజ్ పేయీ ఎంతో సునిశిత, దూర దృష్టి కలిగిన విలక్షణమైన వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఎంతో విలువలతో కూడిన రాజకీయాలు చేశారన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలో కూడా బీజేపీకి లక్షల మంది సానుభూతిపరులు ఉన్నారని తెలిపారు.

అభివృద్ధి సాధించాలంటే అధికారం తప్పనిసరి అని అన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్లమెంటులో ఎన్నో బిల్లు ఆమోదం పొదందాయని గుర్తు చేశారు. అన్ని బిల్లలు కూడా దేశ ప్రజల సంక్షేమానికి దేశ అభివృద్ధికి ఉపయోగపడే బిల్లులే అని చెప్పారు. వాజ్ పేయీ ఆలోచనల ప్రకారం సుపరిపాలన అందించే దిశగా మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement